NTR: ఎన్టీఆర్‌కు ఘన నివాళి
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:38 PM
టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30 వ వర్ధంతిని టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల ఆధ్వ ర్యంలో ఆదివారం నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఆయన విగ్రహాల కు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
-టీడీపీ స్థాపనతో బలహీన వర్గాలకు గుర్తింపు : ఎంపీ బీకే
- యుగపురుషుడు ఎన్టీఆర్
: ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె
టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30 వ వర్ధంతిని టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల ఆధ్వ ర్యంలో ఆదివారం నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఆయన విగ్రహాల కు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు.
కొత్తచెరువు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలుగువారికి ప్రపంచ గుర్తింపు తెచ్చి యుగపురుషుడుగా ప్రజల గుండెట్లో నిలిచిపోయిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే పల్లె సిం ధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ వ ర్ధంతి సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్ర హాని కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ...తనకు రాజకీయ అవకాశం క ల్పించిన మహానేత ఎన్టీ ఆర్ అన్నారు.
తెలుగుదే శం పార్టీ వచ్చిన తరువాతనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం లభించిందన్నారు. అదేవిధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె మా ట్లాడుతూ,...సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్లు అని భావించిన వ్యక్తి ఎన్టీ రామారావు అన్నారు. ప్రజల మనస్సుల్లో ఆరాధ్య దైవంగా నిలిచారన్నారు. ఆయన బాటలోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ పయనిస్తున్నారన్నారు. అనంతరం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....