Share News

PASSENGERS: ప్రయాణికుల అవస్థలు

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:07 AM

పేరు గొప్ప....ఊరుదిబ్బ అన్న చందంగా మారింది కొత్త చెరువు మండల కేంద్రం పరిస్థితి. ఇది జిల్లా కేం ద్రానికి ముఖద్వారం వలె ఉంది. అయితే మండల కేంద్రంలో బస్టాండ్‌ ఉ న్నా నాలుగురోడ్ల కూడలి కి దూరంగా ఉండడంతో ఎవరూ అక్కడికి వెళ్లరు. దీంతో బస్సులు కూడా అక్కడికి వెళ్లవు.

PASSENGERS: ప్రయాణికుల అవస్థలు
People standing on the road waiting for buses

- బస్టాండ్‌ ఉన్నా ఊరికి దూరం

- నాలుగు రోడ్ల కూడలిలోనే బస్సుల కోసం పడిగాపులు

- కొత్త చెరువులో నిలువ నీడలేక ఇబ్బందులు

కొత్తచెరువు, జనవరి 19(ఆంధ్రజ్యోతి): పేరు గొప్ప....ఊరుదిబ్బ అన్న చందంగా మారింది కొత్త చెరువు మండల కేంద్రం పరిస్థితి. ఇది జిల్లా కేం ద్రానికి ముఖద్వారం వలె ఉంది. అయితే మండల కేంద్రంలో బస్టాండ్‌ ఉ న్నా నాలుగురోడ్ల కూడలి కి దూరంగా ఉండడంతో ఎవరూ అక్కడికి వెళ్లరు. దీంతో బస్సులు కూడా అక్కడికి వెళ్లవు. అయితే కూడలిలో కనీసం బస్‌ షెల్టర్‌ కూడా లేకపోవడవంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నిలువ నీడ లేక బస్సుల కోసం దుకాణాల ఎదుట పడిగాపులు కాస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. వివిధ పనుల నిమిత్తం జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రజలు వస్తుంటారు. అదేవిధంగా బాబా సమాధి దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు మం డల కేంద్రం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. బస్టాండ్‌ లేకపోవడంతో బస్సు ల కోసం రోడ్డు పక్కన దుకాణాల ఎదుట నిలబడుతున్నారు.


అయితే దుకాణాల యజమానులు చీదరించుకుంటున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. అంతేగాకుండా కనీసం దాహం వేస్తే గుక్కెడు నీళ్లు కూడా ఉచితంగా దొరకవు. అలాగే మరుగు దొడ్లు లేకపోవడంతో వృద్ధులు, చిన్నారులు, వ్యాది గ్రస్థులు, మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అదే ఆర్టీసీ బస్టాండు ఉంటే ఈ తిప్పలు ఉండవని వారంటున్నారు.

బస్టాండ్‌ ఉన్నా... నిరుపయోగం

మండల కేంద్రంలోని పెనుకొండకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన దాదాపు ఇరవైయ్యేళ్ల క్రితం ఆర్టీసీ బస్టాండును నిర్మించారు. అయితే అది స్థానిక నాలుగు రోడ్ల కూడలికి దూరంగా ఉండడంతో ప్రయాణి కులు అక్కడికి వెళ్లడం లేదు. ఒక వేళ ఎవరైనా వెళ్లినా అక్కడకి బస్సులు రావు. బస్సులను డ్రైవర్లు నాలుగురోడ్ల కూడలిలోనే నిలుపుతూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన ఆ ర్టీసీ బస్టాండ్‌ నిరుపయోగంగా మారింది. ప్రయానికులు తిప్పలు తప్ప డంలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిఽధులు, ఉన్నతాధి కారులు స్పంధించి బస్టాండ్‌కు ఆర్టీసీ బస్సులను నడపాలని ప్రజలు కోరుతున్నారు.


బస్టాండ్‌ వినియోగంలోకి వస్తే మాకు ఉపాధి: హమాలీలు

ఆర్టీసీ బస్టాండ్‌ వినియోగంలోకి వస్తే మాకు జీవనోపాధి లభిస్తుందని హమాలీలు అంటున్నారు. కొత్తచెరువు నుంచి హైద్రాబాద్‌, చెన్నై, విజయవాడ, బెంగళూరు తదితర ప్రాంతాలకు పూలు, ఇతర వస్తువులు ఏఎనఎల్‌ ద్వారా రవాణా అవుతుంటాయి. వాటిని బస్సులపైకి, డిక్కీల్లోకి చేర్చడంవల్ల మాకు ఉపాధి లభిస్తుంది. అంతే కాకుండా చిరువ్యాపారు లకు, ఆటోలు నడిపేవారికి కూడా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. కావున అధికారులు స్పందించి బస్టాండ్‌ వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలి.

ప్రజలు అదరిస్తే వినియోగంలోకి తెస్తాం

- మధుసూదన, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌, పుట్టపర్తి

ప్రజలు ఆదరిస్తే ఆర్టీసీ బస్టాండ్‌ను వినియోగం లోకి తెస్తాం. బస్సు సర్సీసులను పెంచుతాం. ప్ర స్తుతం ముదిగుబ్బ, కదిరి బస్సు సర్వీసులను మా త్రమే వెళ్తున్నాయి. త్వరలో అనంతపురం, హైద రాబాద్‌, చెన్నై, విజయవాడ, బెంగళూరు సర్వీసు లు బస్టాండ్‌కు వెళ్లే విధంగా చర్యలు తీసుకుం టాం. ప్రయాణికులు బస్టాండ్‌కు వెళ్లకుండా నాలుగు రోడ్ల కూడలిలో ఉండడంతో బస్సులను వారి సౌకర్యార్థం ఇక్కడే నిలుపుతున్నాం. అదే ప్రజలు, ప్రయాణికులు బస్టాండ్‌కు వెళ్తే బస్సు సర్వీసులను అన్నింటినీ బస్టాండ్‌కు మళ్లిస్తాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 20 , 2026 | 12:07 AM