Share News

MLA: పోరాట యోధుడు వడ్డె ఓబన్న

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:11 AM

పోరాట యోధుడు వడ్డె ఓబన్న అని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలను కొత్తచెరువు మండల కేంద్రంలోని వడ్డె ఓబన్న విగ్రహం వద్ద ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి పాల్గొని వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

MLA: పోరాట యోధుడు వడ్డె ఓబన్న
MLA and former minister who participated in Kothacheruvu

ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె

కొత్తచెరువు / ఓబుళదేవరచెరువు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): పోరాట యోధుడు వడ్డె ఓబన్న అని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలను కొత్తచెరువు మండల కేంద్రంలోని వడ్డె ఓబన్న విగ్రహం వద్ద ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి పాల్గొని వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు శ్రీనివాసులు, వ డ్డెర కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్‌ ఒలిపిశీన, కొత్తచెరువు మార్కెట్‌యార్డ్‌ చె ౖర్మన పూలశివప్రసాద్‌, టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆది, శ్రీకాళ హస్తి బోర్డు కమిటీ సభ్యులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఓబుళదేవరచెరువు లోని హైవే వద్ద వడ్డె ఓబన్న విగ్రహం ఏర్పాటుకు మాజీ మంత్రి పల్లె భూమి పూజ చేశారు. వడ్డెర సేవా సం ఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ కట్‌ చేశారు. అంతకుముం దు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ పి ట్టా ఓబుల్‌రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ శెట్టివారి జయచంద్ర, వడ్డెర సేవా సంఘం మండల అధ్యక్షుడు ఇడగొట్టు ఆంజినేయులు, ఎంపీటీసీ శ్రీనివాసులు, బీజేపీ మండల అద్యక్షులు వీరాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 12 , 2026 | 12:11 AM