Share News

JC: దేశభక్తికి, త్యాగానికి ప్రతీక వడ్డె ఓబన్న

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:08 AM

స్థానిక కలెక్టరేట్‌లో ఆదివారం స్వాతంత్య్ర సరమయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలనుు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌, ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి రాజేంద్ర రెడ్డి, వడ్డెర సంఘాల నాయకులు పాల్గొని వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

JC: దేశభక్తికి, త్యాగానికి ప్రతీక వడ్డె ఓబన్న
Speaking JC, participating MLA, former minister

జాయింట్‌ కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌

పుట్టపర్తి టౌన, జనవరి 11(ఆంధ్రజ్యోతి): స్థానిక కలెక్టరేట్‌లో ఆదివారం స్వాతంత్య్ర సరమయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలనుు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ మౌర్యభరద్వాజ్‌, ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి రాజేంద్ర రెడ్డి, వడ్డెర సంఘాల నాయకులు పాల్గొని వడ్డె ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జాతికి, దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ప్రజాభుద్యయం కోసం వడ్డే ఓబన్న చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శం అన్నారు. వడ్డె ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు వడ్డెర్ల సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞత లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన కార్పొరేషన డైరెక్టర్‌ పత్తి చంద్రశేఖర్‌, వివిధ సంఘాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 12 , 2026 | 12:08 AM