ROAD: రహదారికి అడ్డంగా పునాదులు
ABN , Publish Date - Jan 12 , 2026 | 11:22 PM
మండల కేంధ్రం సమీపం లోని ధర్మవరం ప్రధాన రహదారి పక్కన సర్వే నెంబరు-384లో 273 మందికి గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలను పంపిణీచేశారు. ఈ లే అవుట్ ధర్మవరం ప్రధాన రహదారికి సమీపంలో ఉడడంతో ఇక్కడి ఇళ్ల ప్లాట్‌లకు మంచి డిమాండ్ ఉంది.
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు
- ఇళ్లకు ఎలా వెళ్లాలి? - కాలనీ వాసుల ఆవేదన
కొత్తచెరువు, జనవరి 12(ఆంధ్రజ్యోతి): మండల కేంధ్రం సమీపం లోని ధర్మవరం ప్రధాన రహదారి పక్కన సర్వే నెంబరు-384లో 273 మందికి గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలను పంపిణీచేశారు. ఈ లే అవుట్ ధర్మవరం ప్రధాన రహదారికి సమీపంలో ఉడడంతో ఇక్కడి ఇళ్ల ప్లాట్‌లకు మంచి డిమాండ్ ఉంది. బండలు, గుండ్లు ఉన్నా ఒక్కో ప్లాట్ రూ.5లక్షల నుంచి రూ. 6 లక్షలు ధర పలుకుతోంది. దీంతో కొంద రు ఇళ్లకు వెళ్లే దారులను సైతం అక్ర మించి పునాదులను వేస్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు. దీంతో తమ ఇళ్లకు వెళేం దుకు దారి లేకుండా పోతోందని అంటున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారు లకు తెలిపినా పట్టించుకోలేదని కాలనీవాసులు తెలుపుతున్నారు. గత వైసీపీ పాలనలో అప్పటి ప్రజాప్రతినిధుల అండదండలతో ఆ పార్టీ నాయకులు కొంత మంది గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులతో ఇళ్ల పట్లాలను అడ్డదిడ్డంగా చేయించుకున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు.
అందులో భాగంగానే కొందరు లే అవ8ఉట్‌లోని ఇళ్లకు వెళ్లే దారులకు సైతం పట్టాలను చేయించుకున్నారనే విమర్శలు వినిపిస్తు న్నాయి. ఆవిధంగా పొందిన ఇళ్ల పట్టాలను వారు ఆఅమ్ముకున్నారు. వాటిని కొన్నవారు ప్రస్తుతం దారుల్లో పునాదులు వేస్తున్నారని, దీంతో తమ ఇళ్లకు దారిలేకుండా పోతోందని పలువురు కాలనీ వాసులు అవేద న వ్యక్తం చేసున్నారు. మరికొందరు స్థలాలకు పట్టాలు లేకపోయినా పునాదులు వేశారన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి దారికి అడ్డంగా వేసిన పునాదులను తొలగించి ఇళ్లకు రహదారి సౌకర్యం కల్పించాలని కాలనీలోని ప్రజలు కోరుతున్నారు.
మా దృష్టికి తీసుకురాలేదు- బాలాంజినేయులు, ఇనచార్జ్ తహసీల్దార్
ఇళ్లకు వెళ్లే దారుల్లో పునాదులు వేశారని కాలనీకి చెందిన ప్రజలు మా దృష్టికి తీసుకు రాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తాం. దారికి అడ్డంగా పునాది వేసి ఉంటే ఆ పునాదిని తొలగిస్తాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....