SATHYA SAI: అలరించిన ప్రేమామృతం
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:34 PM
సత్యసాయి విద్యార్థులు చేప ట్టిన గానకచేరి భక్తులను అలరింపజేసింది. సంక్రాంతి సంబరాల సందర్భంగా బెంగళూరు బృందావన, చిక్ బళ్లాపూర్ నందగిరి విద్యా ర్థులు బుధవారం రాత్రి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత సభామండపంలో ప్రేమామృతం పేరిట గాన కచేరి ని ర్వహించా రు.
పుట్టపర్తి, జనవరి 14(ఆంధ్రజ్యోతి): సత్యసాయి విద్యార్థులు చేప ట్టిన గానకచేరి భక్తులను అలరింపజేసింది. సంక్రాంతి సంబరాల సందర్భంగా బెంగళూరు బృందావన, చిక్ బళ్లాపూర్ నందగిరి విద్యా ర్థులు బుధవారం రాత్రి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత సభామండపంలో ప్రేమామృతం పేరిట గాన కచేరి ని ర్వహించా రు. బ్రాస్‌బ్యాండ్, వీణా, వాయిద్యం, తబలా వాయిద్య గానంతో భ క్తులను అలరించారు. సత్యసాయి ప్రేమ తత్వంపై భక్తి గీతాలాపన చేశారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....