DC: సమస్యలను సత్వరమే పరిష్కరించండి
ABN , Publish Date - Jan 12 , 2026 | 11:52 PM
ప్రజల సంతృప్త స్థాయి పెరిగేలా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలను త్వరితగతిన నాణ్యంగా పరిష్కరించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య
పుట్టపర్తి టౌన, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ప్రజల సంతృప్త స్థాయి పెరిగేలా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలను త్వరితగతిన నాణ్యంగా పరిష్కరించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భం గా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య మాట్లాడుతూ ఫిర్యాదు దారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 256 అర్జీలు వచ్చాయి.
వాటిని పరిష్కరించే విధంగా సంబంధి త శాఖల అధికారులకు కలెక్టర్ సూచిస్తారని అయన తెలిపారు.
పుట్టపర్తి రూరల్: ప్రజా ఫిర్యాదుల పరిష్కా ర వేదికలో (పీజీఆర్‌ఎస్) తమ సమస్యలకు పరి ష్కారం చూపుతారనే భరో సా బాధితులకు కల్పించే విధంగా చొరవ తీసుకోవాలని అడిషనల్ ఎస్పీ అంకితా సురానా పోలీసు అధికారులకు సూ చించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం అడిషనల్ ఎస్పీ ఆధ ్వర్యంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ఫిర్యాదుదా రులతో అడిషనల్ ఎస్పీ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పీజీఆర్‌ఎస్‌లో వివిధ సమస్యలపై 70 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో లీగల్ ఆడ్వైజర్ సాయినాథరెడ్డి, ఎస్బీ సీఐ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ సీఐ లక్ష్మీకాంతరెడ్డి సీబ్బంది పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....