Home » Puttaparthy
ఏళ్లు గడుస్తున్నా తమకా దారి కష్టాలు తీరడం లేదు. రహదారి గుంతలమయంగా మార డంతో తాము పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదంటూ మండలం లోని ఉగ్గిరెడ్డిపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం రూపొం దించిన 2026-27 బడ్జెట్‌లో అంగనవాడీలు తదితర స్కీమ్ వర్కర్లకు వేతనాల పెంపు కోసం నిధులు కేటా యించకపోవడం అన్యాయమని ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి అన్నారు. సీఐటీయూ ఆల్‌ఇండియా కమిటీ పిలుపు మేరకు మండలకేంద్రంలో మంగళవారం అంగనవాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు.
పింఛన్ల తొలగింపు లో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హస్తముందని వైసీపీ నాయకు లు జగన సొంత పత్రికలో అసత్య ఆరోపణలు చేయడం తగదని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మండల కన్వీనర్ శెట్టివారి జయచంద్ర, నాయకులు షేక్‌నిజాం వలీ, రాజారెడ్డి మంగళవారం మం డల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావే శం ఏర్పా టు చేసి మాట్లాడారు.
సత్యసాయి గిరి ప్రదక్షిణను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి ప్రశాంతి నిల యం గణేష్ గేటు వద్ద సత్యసాయి రథాన్ని ప్రత్యేకంగా అలంకరిం చి పూజలు చేశారు. భక్తిపాటలు పాడుతూ రథాన్ని లాగారు.
తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డితోనే నియోజకవ ర్గం అబివృద్ది సాధ్యమని అమడగూరు మండలం దిండిమీదపల్లి వైసీపీ కార్యకర్తలు పేర్కొన్నారు.
మండలంలోని తంగేడుకుంట గ్రామంలో జిల్లా పరిషత ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం, అదే గ్రామానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ హెబ్బార్ అమర్‌నాథ్ తమ వంతుగా రూ. 50వేలు విరాళం అందించారు.
నియోజకవర్గం అభివృద్ధికి తగిన ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని పుట్టపర్తి ని యోజకవర్గ ఇన్చార్జ్, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పలువురు మంత్రులను కోరా రు. ఆయన బుధవారం విజయవాడలోని అమ రావతి సచివాలయంలో మం త్రులను ఆయన కలసి విన్నవించారు.
మండలంలోని ఆదర్శ గ్రామాలైన అమడగూరు, మహమ్మదాబాద్ గ్రామ పంచాయతీలలో చెత్తతో సంపద కేంద్రాలలో వర్మీ కంపోస్ట్ ఎరువులు తయారు చేసి రైతులకు అందు బాటులో ఉంచుతున్నారు. ఆయా పంచాయతీల్లో గ్రా మాలలో ఉన్న చెత్తను రోజూ గ్రీన అంబాసిడర్‌ల ద్వారా సేకరిస్తు న్నా రు.
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన ‘ఇంటి గడప నుంచి దేవుని గడప వరకు’ సంకల్ప పాదయాత్రకు మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆయన మంగళవారం కర్నూలు జిల్లా బేతంచెర్ల వద్ద కొనసాగుతున్న సంకల్పయాత్రలో బండ్ల గణేష్‌ను కలసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.
గత ఏడాది డిసెంబరు 17న పుట్టపర్తి డివిజన స్థాయిలో విద్యార్థులకు ఏపీ ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. క్విజ్‌లో మొదటి మూడు బహుమతులు వరుసగా రూపశ్రీ(జడ్పీహెచఎస్, కొరివాండ్లప ల్లి). సి.వరుణ్(జడ్పీహెచఎస్, సిద్దరాంపురం), కే.వాణి(జడ్పీహెచఎస్ బాలికల ఉన్నతపాఠశాల, కొత్తచెరువు) విద్యార్థులకు అందజేశారు.