SCHOOL: ప్రభుత్వ పాఠశాలకు రూ. 50వేలు విరాళం
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:28 AM
మండలంలోని తంగేడుకుంట గ్రామంలో జిల్లా పరిషత ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం, అదే గ్రామానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ హెబ్బార్ అమర్‌నాథ్ తమ వంతుగా రూ. 50వేలు విరాళం అందించారు.
ఓబుళదేవరచెరువు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తంగేడుకుంట గ్రామంలో జిల్లా పరిషత ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం, అదే గ్రామానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ హెబ్బార్ అమర్‌నాథ్ తమ వంతుగా రూ. 50వేలు విరాళం అందించారు. ఆ సొమ్ముతో పాఠశాల ప్రారంగణంలోని క్రీడా మైదానానికి మట్టి తరలించి చదును చేస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీని వాసులు బుధవారం తెలిపారు. ఆయన తండ్రి కృష్ణమూర్తి పాఠశా లకు స్థలం విరాళంగా ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యా యులు రాజేష్, తిరుపాల్‌నాయక్, కలీముల్లా, జనార్దన, గ్రామస్థులు నరేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....