Share News

GARBAGE: చెత్తతో సంపద తయారీ

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:10 AM

మండలంలోని ఆదర్శ గ్రామాలైన అమడగూరు, మహమ్మదాబాద్‌ గ్రామ పంచాయతీలలో చెత్తతో సంపద కేంద్రాలలో వర్మీ కంపోస్ట్‌ ఎరువులు తయారు చేసి రైతులకు అందు బాటులో ఉంచుతున్నారు. ఆయా పంచాయతీల్లో గ్రా మాలలో ఉన్న చెత్తను రోజూ గ్రీన అంబాసిడర్‌ల ద్వారా సేకరిస్తు న్నా రు.

GARBAGE: చెత్తతో సంపద తయారీ
Staff making vermicompost in Mohammedabad

అమడగూరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆదర్శ గ్రామాలైన అమడగూరు, మహమ్మదాబాద్‌ గ్రామ పంచాయతీలలో చెత్తతో సంపద కేంద్రాలలో వర్మీ కంపోస్ట్‌ ఎరువులు తయారు చేసి రైతులకు అందు బాటులో ఉంచుతున్నారు. ఆయా పంచాయతీల్లో గ్రా మాలలో ఉన్న చెత్తను రోజూ గ్రీన అంబాసిడర్‌ల ద్వారా సేకరిస్తు న్నా రు. తడి చెత్త, పొడి చెత్త వేరుచేసి చెత్తతో సంపద తయారీ కేం ద్రా లకు తరలిస్తారు. ప్రస్తుతం తడి చెత్త నుంచి ఎరువు తయారు చేస్తు న్నారు. పొడి చెత్త సిద్ధంగా ఉందని, సంబంధిత పరికరాలు వచ్చిన తరువాత దాని నుంచి ఎరువు తయారు చేస్తామని అధికారులు చెబు తున్నారు. తడిచెత్తను 40 రోజుల పాటు కుళ్లబెట్టి మరో తొట్టెలోకి మా రుస్తారు. ఈ తొట్టెను వానపాములతో నింపుతారు. మరో 40 రోజుల తరువాత తయారైన ఎరువును 10 కేజీల బ్యాగులలో నింపి నిల్వ చేసి, రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్కో బ్యాగ్‌ రూ. 120 దాకా అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో సంపద కేంద్రంలో పొడి చెత్తకు ఆరు తొట్టెలు, తడి చెత్తకు ఆరు తొట్టెలు నిర్మించారు.


ఒక్కో తొ ట్టె నుంచి 500 కేజీల దాకా ఎరువు తయారు చేస్తు న్నారు. అం దుబాటులో ఉన్న ఎరువును రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు. ఈ వర్మీ కంపోస్ట్‌ ఎరువులు వాడటం వలన మొక్కలకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, రసాయన ఎరువుల కంటే ఎక్కువ సూక్ష్మ పోషకాలు కలిగిఉంటాయని చెబుతున్నారు. దీంతో వానపాములతో తయారైన వర్మీ కంపోస్ట్‌ ను భూమిలో వేసి పంటలు సాగు చేసినట్లైతే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించవచ్చని అధికారులు తెలుపుతున్నారు.

సేంద్రియ ఎరువులతో మంచి దిగుబడి

- వెంకటరమణాచారి, వ్యవసాయాధికారి

సేంద్రియ ఎరువుల వాడకంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అ న్ని పంటలకు సేంద్రియ ఎరువులు వాడితే సుక్ష్మ పోషకాలు పెరిగి పం టల దిగుబడి బాగుంటుంది. రసాయన ఎరువులు వాడటం వలన అ నేక నష్టాలు ఉన్నాయి. దీంతో వర్మీ కంపోస్ట్‌ ఎరువులు, సేంద్రియ ఎరువులు వాడితే మేలు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 29 , 2026 | 12:10 AM