FORMER MINISTER: నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వండి
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:18 AM
నియోజకవర్గం అభివృద్ధికి తగిన ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని పుట్టపర్తి ని యోజకవర్గ ఇన్చార్జ్, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పలువురు మంత్రులను కోరా రు. ఆయన బుధవారం విజయవాడలోని అమ రావతి సచివాలయంలో మం త్రులను ఆయన కలసి విన్నవించారు.
- విజయవాడలో పలువురు మంత్రులను కోరిన మాజీ మంత్రి పల్లె
పుట్టపర్తిరూరల్, జనవరి 28 (ఆంద్రజ్యోతి): నియోజకవర్గం అభివృద్ధికి తగిన ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని పుట్టపర్తి ని యోజకవర్గ ఇన్చార్జ్, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పలువురు మంత్రులను కోరా రు. ఆయన బుధవారం విజయవాడలోని అమ రావతి సచివాలయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఇరిగేషనశాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత, దేవదా యం సాంఘిక సంక్షేమం, మైనార్టీశాఖ మం త్రులు అనం రామనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజినేయులు, ఎండీఫారుఖ్‌లను ఆయన కలసి విన్నవించారు. ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి సూచనల మేరకు నియోజకవర్గంలో సమస్యల పరిస్కారానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఇచ్చిన లేఖలను మంత్రులకు అందజేశారు. నియోజకవర్గంలో ప్రాధా న్యత కల్గిన 193 చెరువులు, రెండు రిజర్వాయర్లకు హంద్రీనీవా కాలువ ద్వారా నీటిని అందించేపనులను మఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. అలాగే మిగిలిన అంశాలపై ఆయా శాఖ మంత్రులను కోరగా, పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మంత్రులు హామి ఇచ్చినట్లు పల్లె తెలిపారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించి పుట్టపర్తి ఖ్యాతని ప్రపంచానికి చాటిన ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డిని పలువురు మంత్రులు అభినందించినట్లు ఆయన తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....