Share News

TDP: అసత్య ఆరోపణలు తగవు : టీడీపీ

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:10 AM

పింఛన్ల తొలగింపు లో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హస్తముందని వైసీపీ నాయకు లు జగన సొంత పత్రికలో అసత్య ఆరోపణలు చేయడం తగదని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మండల కన్వీనర్‌ శెట్టివారి జయచంద్ర, నాయకులు షేక్‌నిజాం వలీ, రాజారెడ్డి మంగళవారం మం డల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావే శం ఏర్పా టు చేసి మాట్లాడారు.

TDP:  అసత్య ఆరోపణలు తగవు : టీడీపీ
TDP leaders speaking in the meeting

ఓబుళదేవరచెరువు, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): పింఛన్ల తొలగింపు లో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హస్తముందని వైసీపీ నాయకు లు జగన సొంత పత్రికలో అసత్య ఆరోపణలు చేయడం తగదని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మండల కన్వీనర్‌ శెట్టివారి జయచంద్ర, నాయకులు షేక్‌నిజాం వలీ, రాజారెడ్డి మంగళవారం మం డల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావే శం ఏర్పా టు చేసి మాట్లాడారు. మండలంలోని చెరువు మునియప్ప గారిపల్లిలో ఆధార్‌కార్డులో వయ స్సు మార్పు చేశారన్న ఫిర్యాదులు రావడంతో అధికారులు వారి పింఛన్లు నిలిపివేశారన్నారు. దీనిపై మాజీ మంత్రి పల్లెకు ఎలాంటి సం బంధం లేదన్నారు. అర్హులను తొలగించే సంస్కృ తి వైసీనీ వారిదన్నారు. విష ప్రచారం మానుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించకోక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షుడు బూదిలి ఓబులరెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ డైరెక్టర్‌ కంచి సురేష్‌, సహాకర సంఘం అధ్యక్షులు బోయపల్లి శివారెడ్డి, నాయకులు కొత్త సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 04 , 2026 | 12:10 AM