Share News

STUDENTS: విజేతలకు బహుమతుల పంపిణీ

ABN , Publish Date - Jan 26 , 2026 | 11:51 PM

గత ఏడాది డిసెంబరు 17న పుట్టపర్తి డివిజన స్థాయిలో విద్యార్థులకు ఏపీ ఎస్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో వ్యాసరచన, క్విజ్‌, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. క్విజ్‌లో మొదటి మూడు బహుమతులు వరుసగా రూపశ్రీ(జడ్పీహెచఎస్‌, కొరివాండ్లప ల్లి). సి.వరుణ్‌(జడ్పీహెచఎస్‌, సిద్దరాంపురం), కే.వాణి(జడ్పీహెచఎస్‌ బాలికల ఉన్నతపాఠశాల, కొత్తచెరువు) విద్యార్థులకు అందజేశారు.

STUDENTS: విజేతలకు బహుమతుల పంపిణీ
Officials of the Department of Electricity presenting certificates of appreciation to the students

కొత్తచెరువు, జనవరి 26(ఆంధ్రజ్యోతి): గత ఏడాది డిసెంబరు 17న పుట్టపర్తి డివిజన స్థాయిలో విద్యార్థులకు ఏపీ ఎస్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో వ్యాసరచన, క్విజ్‌, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. క్విజ్‌లో మొదటి మూడు బహుమతులు వరుసగా రూపశ్రీ(జడ్పీహెచఎస్‌, కొరివాండ్లప ల్లి). సి.వరుణ్‌(జడ్పీహెచఎస్‌, సిద్దరాంపురం), కే.వాణి(జడ్పీహెచఎస్‌ బాలికల ఉన్నతపాఠశాల, కొత్తచెరువు) విద్యార్థులకు అందజేశారు. వక్తృ త్వంలో మహిశాజనంత (జడ్పీహెచఎస్‌, బీడుపల్లి), కె. షిమాబ్‌ పరిహీర్‌(జడ్పీహెచఎస్‌ కొత్తచెరువు), వై భవిత (జడ్పీ హెచఎస్‌ బారా ల) అందుకున్నారు. అలాగే వ్యాసరచన పోటీలలో ఎం బిందుశ్రీ (జడ్పీ హెచఎస్‌, కొవిరివాండ్లపల్లి), ఎం లల్లి(జడ్పీహెచఎస్‌, సిద్దరాంపురం), హీనా తబసు(జడ్పీహెచఎస్‌, బీడుపల్లి)కి అందజేశారు. మూడు విభా గాలలో మొదటి బహుమతి కింద రూ.1000 చొప్పున, రెండో బహుమతి రూ.750, మూడో బహుమతి రూ.500చొప్పున నగదుతో పాటు ప్రశం సాపత్రం అందజేసినట్టు జిల్లా సైన్స అధికారి తనూజ్‌కుమార్‌ తెలిపా రు. ఈ బహుమతులను గణతంత్ర దినోత్సవం సందర్భంగా పుట్టపర్తి లోని పోలీసు పెరేడ్‌ గ్రౌండ్‌లో విద్యార్థులకు అందజేశారన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కిష్ణప్ప, విద్యుతశాఖ చీఫ్‌ ఇంజనీర్‌ సంపత కుమార్‌, సూపరింటెండెంట్‌ మోజస్‌,డివిజనల్‌ ఇంజనీర్‌ శివరాం, ఏఈ సాయినాథ్‌ పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 26 , 2026 | 11:51 PM