FORMER MINISTER: బండ్ల గణేష్ పాదయాత్రకు సంఘీభావం
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:40 PM
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన ‘ఇంటి గడప నుంచి దేవుని గడప వరకు’ సంకల్ప పాదయాత్రకు మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆయన మంగళవారం కర్నూలు జిల్లా బేతంచెర్ల వద్ద కొనసాగుతున్న సంకల్పయాత్రలో బండ్ల గణేష్‌ను కలసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.
పుట్టపర్తి రూరల్, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన ‘ఇంటి గడప నుంచి దేవుని గడప వరకు’ సంకల్ప పాదయాత్రకు మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆయన మంగళవారం కర్నూలు జిల్లా బేతంచెర్ల వద్ద కొనసాగుతున్న సంకల్పయాత్రలో బండ్ల గణేష్‌ను కలసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఈ సంకల్ప యాత్ర విజయవంతంగా పూర్తీకావాలని ఆకాంక్షించారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు బండ్ల గణేష్‌కు ఎల్లవేళలా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....