Home » Puttaparthy
కార్మిక సమస్యలపై 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతున్న సీఐటీయూ ఆల్‌ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
పట్టణంలోని అన్నివీధులు ఇక సీసీరోడ్లుగా మార్చుతామని మున్సిపల్ చైర్మన రమేష్ అన్నారు. సోమవారం పట్టణంలోని మూడో వార్డులో రూ.92.5కోట్ల నిధులతో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.
మండల వ్యాప్తంగా ఐదేళ్ల క్రితం మంజూరైన ప్రభుత్వ లేఅవుట్లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఏ లేఅవుట్‌లోచూసినా మట్టిరోడ్లు, ముళ్లకంపలు, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి. గత యేడాది ప్రభుత్వ లేఅవుట్లను పేరు మార్చుతూ ఎన్టీఆర్‌నగర్‌లుగా ప్రభుత్వం జీవో జారీచేసింది.
పట్టణాన్ని అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లక్ష్యమని మున్సిపల్ చైర్మన రమేష్, టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీఏ వీరయ్య అన్నారు.
రాజీమార్గం ఎంతో ఉత్తమమని హిందూపురం అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అ న్నారు. శనివారం జాతీయ మెగా లోక్ అదాలత నిర్వహించారు. 245 కేసులు నాలుగు బెంచీల ద్వారా పరిష్కరించారు.
మడకశిర నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. మండలంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని శంకుస్థాపను చేశారు.
మండలంలోని బూదిలి సమీ పం చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో పంటలు సాగుచేస్తున్న రైతు లు ఆందోళనకుగురవుతుందన్నారు. బూదిలి వద్దనున్న పాత వంతెన దెబ్బతినడంతో, చిత్రావతి నదిపై వంతెన నిర్మాణానికి రూ.8.52కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.
విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. విద్యాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ కృషి చేస్తుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని భూములు తీసుకున్నారు. ఏడాది దాటినా నష్టపరిహారం చెల్లించలేదంటూ చిలమత్తూరు మండలం టేకులోడు గ్రామ రైతులు అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం చిలమత్తూరులో ప్రజాదర్బార్ నిర్వహించారు.
ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన అధికారి డాక్టర్ సురే్‌షబాబు ఆదేశించారు.