FACILITIES : వసతుల లేమి
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:59 PM
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ప్రహరీ లేకపోవడంతో విషపురుగుల భ యంతో విద్యార్థులు గడపాల్సి వస్తోంది. మండలంలోని కొండకమర్ల, గౌనిపల్లి, ఓబులదేవరచెరువు, మిట్టపల్లిల్లో బీసీ బాలుర సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి.
- ఇబ్బందులు పడుతున్న సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు
ఓబుళదేవరచెరువు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ప్రహరీ లేకపోవడంతో విషపురుగుల భ యంతో విద్యార్థులు గడపాల్సి వస్తోంది. మండలంలోని కొండకమర్ల, గౌనిపల్లి, ఓబులదేవరచెరువు, మిట్టపల్లిల్లో బీసీ బాలుర సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో మండల కేంద్రమైన ఓబుళదేవరచెరువులోని వసతిగృహం, గౌనిపల్లి వసతి గృహాలకు ప్రహరీలు లేవు. ప్రధానంగా గౌనిపల్లి వసతిగృహం వెనుక వైపు ముళ్ళ చెట్లు పెరిగి, చెత్తాచెదారం పేరుకుపోయింది. అక్కడి నుంచి విషపురుగులు వసతిగృహంలోకి వ స్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. అంతేగాకుండా ఈ వసతి గృహంలో విద్యార్థులు ఆరు బయటనే భోజనాలు చేయాల్సి వస్తోందని, ఎండాకాలం చాలా ఇబ్బంది పడాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతు న్నారు.
ఇదిలా ఉండగా ఏ వసతి గృహంలోనూ ఆర్‌ఓ ప్లాంట్‌లు లేక పోవడంతో బయట నుంచి నీటి ట్యాంక్ ద్వారా, క్యానలతో నీళ్లు తెచ్చు కుని నీళ్ళతో కాలం గడుపుతున్నారు. అవి విద్యార్థులకు ఏ మాత్రం చాలడం లేదు. ఇక ఓబులదేవరచెరువు వసతి గృహానికి రహదారి సౌ కర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పలు మా ర్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని హాస్టల్ సిబ్బంది, విద్యా ర్థులు వాపోతున్నారు. కొండకమర్ల బాలుర వసతి గృహంలో విద్యార్థు ల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఇనుమ మంచాలు చాలా ఉన్నాయి. అయితే అందుకు సరిపడా విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో అవి నిరూపయోగంగా ఉన్నాయి.
సమస్యలు పరిష్కరించాలి
మండలంలోని వసతి గృహాలకు ప్రహరీలు నిర్మించాలని, ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గౌనిపల్లి వసతిగృహంలో ఆరుబయటే విద్యార్థులు భోజనం తినాల్సి వస్తోందని, సన సైడ్ కింద కూర్చున్నా వర్షం కురిసిన ప్పుడు వర్షంతో, మధ్యాహ్నం వేళ ఎండతో ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఆరుబయట షెడ్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా పలు వసతి గృహాల్లో ప్రభుత్వం నిర్ధేశించిన మెనూ పాటించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అఽధికారులు తనిఖీలు చేస్తే వాస్తవ విషయాలు బయటపడతాయని పలువురు పేర్కొంటున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....