Share News

COLLECTOR: డిగ్రీ కళాశాలను సందర్శించిన కలెక్టర్‌

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:05 AM

పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ మంగళవారం సందర్శంచారు. కళాశాల సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమై అనేక ప్రశ్నలు అడిగారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ విత్తనం ఏవిధంగా భూమిని చీల్చుకుని వచ్చి సమాజానికి ఉపయోగప డుతుందో, అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుకుని సమాజానికి ఉపయోగపడాలని సూచించారు.

COLLECTOR: డిగ్రీ కళాశాలను సందర్శించిన కలెక్టర్‌
Collector talking to degree college students

బుక్కపట్నం, ఫిబ్రవరి10 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ మంగళవారం సందర్శంచారు. కళాశాల సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మమేకమై అనేక ప్రశ్నలు అడిగారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ విత్తనం ఏవిధంగా భూమిని చీల్చుకుని వచ్చి సమాజానికి ఉపయోగప డుతుందో, అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుకుని సమాజానికి ఉపయోగపడాలని సూచించారు. సంకల్ప బలంతో చదివితే సాఽఽధించలే నిది ఏదీలేదన్నారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల ఫ్రీఫైనల్‌ కేంద్రాన్ని పరిశీలించి, విద్యార్థులకు సూచనలు, సలహాలిచ్చారు. ఆయనతో పాటు డీఈఓ కిష్టప్ప, ప్రిన్సిపాల్‌ శ్రీనివాసు లు, రాజ్‌మహమ్మద్‌, ఎనఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ అధికారి ఓబులేసు, భారతి, సోమకోటి శంకర్‌, హరీష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Feb 11 , 2026 | 12:05 AM