MODEL SCHOOL: చెట్ల కిందే వంట
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:57 PM
మండలకేంద్రంలోని ఏపీ మో డల్ స్కూల్‌లో సమస్యలు తిష్ట వేశాయి. పాఠశాలల ప్రతి సంవ త్సరం పిల్లల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా కనీస మౌలి క వసతులు కల్పించడం లేదు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు ఉపాధ్యా యులను కూడా నియమించడం లేదు.
- మోడల్ స్కూల్‌లో సమస్యల తిష్ట
- ప్రహరీ పూర్తికాక తీవ్ర ఇబ్బందులు
- పట్టించుకోని అధికారులు
నల్లచెరువు, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని ఏపీ మో డల్ స్కూల్‌లో సమస్యలు తిష్ట వేశాయి. పాఠశాలల ప్రతి సంవ త్సరం పిల్లల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా కనీస మౌలి క వసతులు కల్పించడం లేదు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు ఉపాధ్యా యులను కూడా నియమించడం లేదు. దీంతో విద్యార్థులు ఎవరికీ చెప్పుకోలేక ఉన్న దాంట్లోనే సర్దుకుపోతున్నారు. ఈ మోడల్‌స్కూల్‌లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు దాదాపు 670 మందికి పైగా విద్యార్థులు చదువున్నారు. ఆంగ్ల మాధ్యమం కావడంతో మండల నుంచే కాకుండా ఇతర మండలాల నుంచి విద్యార్థులు ఇక్కడ చేరుతు న్నారు. ఇందులో పాఠశాలతో పాటు కళాశాల ఉంది. కానీ మోడల్ స్కూల్‌లో పిల్లలు ఆడుకునేందుకు స్థలం లేదు. వర్షాకాలం వచ్చిందం టే చాలు పాఠశాల ఆవరణం మొత్తం బురదమయం అవుతోంది.
వంట గది లేక ఇబ్బందులు
మోడల్ స్కూల్ ఏర్పాటై ఇప్పటకి దాదాపు 15 ఏళ్లు గడుస్తోంది. కానీ విద్యార్థులకు మధ్యా హ్న భోజనం వండేందుకు వంట గది నిర్మించ కపోవ డం విశేషం. వంట ఏజెన్సీ వారు ఆరుబయటనే ఎండైనా, వానై నా భరిస్తూ, ఆరుబయట మురునీరు వెళ్తున్న చోటనే చెట్లకింద వండా ల్సి వస్తోంది.
ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి మో డల్ స్కూల్‌లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఇతర సమస్య లను పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదం డ్రులు కోరుతున్నారు.
పూర్తికాని ప్రహరీ : గత వైసీపీ ప్రభుత్వంలో 2019-20 సంవత్సరంలో రూ. 36 లక్షలతో పాఠశాలకు ప్రహరీ మంజూరైంది. అప్పటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అసంపూర్ణంగా నాసిరకంగా ప్లాస్టింగ్‌లు కూడా లేకుండా ప్రహరీ నిర్మింనినట్లు ప్రజలు విమర్శిస్తున్నారు. అంతేగాకుండా ప్రధాన ద్వారానికి గేటు లేకపోవడంతో హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు నిత్య ం భయాందోళనతో గడుపుతున్నారు.
పిల్లర్ల నుంచి నీరు : మోడల్ స్కూల్‌కు ఆనుకొని చెరువు ఉంది. దీంతో చెరువులోని నీరు బిల్డింగ్ పిల్లర్‌లలో ఊట రూపంలో బయటకు వస్తోంది. దీంతో బిల్డింగ్ చుట్టూ నీరు చేరి ఆవరణం బుదరమయం అయింది. నిరంతరం చెరువు నీరు ఊరుతుండటంతో బిల్డింగ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని విద్యార్థులు, టీచర్‌లు భయాం దోళనలో వ్యక్తం చేస్తున్నారు.
- ఈ విషయంపై సర్వశిక్ష అభియాన ఏఈ రషీద్‌ను వివరణ కోరగా... నల్లచెరువు ఏపీ మోడల్ స్కూల్‌లో నెలకొన్న సమస్యలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుకెళ్లి అన్నిటినీ పరిష్కరిస్తామని ఆయన అన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....