FESTIVALS: ఘనంగా ఉరుసు ఉత్సవాలు
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:06 AM
మండలకేంద్రంలోని మ స్తానవలీ దర్గా ఉరుసు మహోత్సవాలు ఆదివారం జియారతతో ముగిసినట్టు ముతవల్లి మాణిక్యంబాబా తెలిపా రు. ఉరుసు మహోత్సవాల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదివారం రాత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రార్థనలు చేశారు.
హాజరైన మాజీ మంత్రి పల్లె
కొత్తచెరువు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని మ స్తానవలీ దర్గా ఉరుసు మహోత్సవాలు ఆదివారం జియారతతో ముగిసినట్టు ముతవల్లి మాణిక్యంబాబా తెలిపా రు. ఉరుసు మహోత్సవాల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదివారం రాత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రార్థనలు చేశారు. ఆయనకు ముస్లింలు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు , టీడీపీ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓబుళదేవరచెరువు : మండలంలోని అచ్చేమియాపల్లెలో వెలసిన అచ్చేమియా సాహెబ్ దర్గాలో సోమవా రం ఉరుసు ఉత్సవం ఘనంగా జరిగింది. మండలం నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంర వచ్చిన భక్తులు అచ్చేమి మా సాహెబ్ సమాధిని దర్శించుకుని, ప్రార్థనలు చేశారు. నిర్వాహ కులు భక్తులకు అన్నదానం నిర్వహించారు. రాత్రి నిర్వహించిన ఖ వ్వాలి, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎస్‌ఐ బి మల్లి కార్జున రెడ్డి బందోబస్తు నిర్వహించారు. ఉరుసులో దుకాణాలు భక్తులతో కిటకిట లాడాయి. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాత్రి సాహెబ్ సమాధిని దర్శించుకుని, ప్రత్యేక పార్థనలు చేశారు.