Home » Puttaparthy
యేసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖమంత్రి సవిత పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షక కమిటీ సమావేశం నిర్వహించారు.
స్థానిక సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ దాడుల కలకలం రేగింది. ఏసీబీ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న అధికారి, ఉద్యోగులు అక్కడి నుంచి పరారయ్యారు. కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ఏసీబీ అధికారులు వెనుదిరిగారు.
జిల్లా పోలీసు స్పోర్ట్స్ మీట్‌తో పరేడ్ మైదానంలో ఎటుచూసినా సందడే సందడి. ఎస్పీ రత్న సైతం పలు క్రీడాంశాల్లో పోటీపడి, ఉత్సాహం నింపారు. ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీల మధ్య పరుగు పందెం నిర్వహించారు.
ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు నీరుగారుతున్నాయి. కొందరు అధికారలు సదస్సులకు డుమ్మా కొడుతుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు హెచ్చరించారు. గురువారం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మడకశిర నగర పంచాయతీ ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాజ్యసభలో అంబేడ్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అమితషా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన మంత్రి పదవితోపాటు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బహుజన చైతన్యవేదిక అధ్యక్షుడు శివరామక్రిష్ణ డిమాండ్ చేశారు.
రబీ సీజనలో రైతులు బోరు బావుల కింద రాగిపంట సాగు చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని మోరుబాగల్ గ్రామంలో రాగి పంట సాగుపై రైతులతో సమావేశం నిర్వహించారు.
పట్టణంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. ప్రియాంకనగర్‌లో పుట్టపర్తి రహదారి పక్కనగల కాంప్లెక్స్‌లోని నాలుగు దుకాణాల్లో చోరీ చేశారు. షట్టర్లను ఇరువైపులా వంచి, తాళాలను పక్కకు జరిపి లోపలకు చొరబడ్డారు.
జైళ్లలో ఏళ్లుగా మగ్గిపోతున్న వయోవృద్ధులకు విముక్తి కల్పించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం శ్రీకారం చుట్టిందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు.
నల్లమాడకు చెందిన కాంట్రాక్టర్ బశెట్టి రాజశేఖర్ (49) హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసు విచారణలో తేలింది.