GOD: ఘనంగా శ్రీకృష్ణుడి గ్రామోత్సవం
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:50 PM
త్రైత సిద్ధాంత ప్ర బోధ సేవాసమితి, ఇందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల పరిధిలోని తుంపర్తి గ్రామంలో శ్రీకృష్ణుడి ఊరేగింపును ఘ నం గా నిర్వహించారు. ఈ నెల 16న కృష్ణా ష్టమి నుంచి పూజలందుకున్న శ్రీకృష్ణుడి ప్రతిమను గురువారం అలంకరించి గ్రామంలో ఊరేగించారు. స్థానికులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి సేవాసమితి సభ్యులు తరలివచ్చి గ్రామోత్సవంలో భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ధర్మవరం రూరల్, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): త్రైత సిద్ధాంత ప్ర బోధ సేవాసమితి, ఇందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల పరిధిలోని తుంపర్తి గ్రామంలో శ్రీకృష్ణుడి ఊరేగింపును ఘ నం గా నిర్వహించారు. ఈ నెల 16న కృష్ణా ష్టమి నుంచి పూజలందుకున్న శ్రీకృష్ణుడి ప్రతిమను గురువారం అలంకరించి గ్రామంలో ఊరేగించారు. స్థానికులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి సేవాసమితి సభ్యులు తరలివచ్చి గ్రామోత్సవంలో భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో చిన్నారులు ఆకట్టుకున్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఇందూ జ్ఞాన వేదిక తుంపర్తి కమిటీ అధ్యక్షుడు అప్పిరెడ్డి, సభ్యులు శివారెడ్డి, ప్రతాప్, యోగా నందరెడ్డి, అశోక్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, గోవిందు, రామ్మోహనరెడ్డి, కాంతమ్మ, శ్రీలత, వరలక్ష్మి, లక్ష్మి, గ్రామస్థులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....