Share News

AGITATION: త్వరగా వెరిఫికేషన చేయాలి

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:35 AM

గంటల కొద్దీ త్వరగా వెరిఫికే షన పూర్తి చేయాలని దివ్యాంగ పింఛన దారులు సోమవారం స్థానిక ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. వైసీపీ పాలనలో ఇష్టారాజ్యంగా పింఛన్లు పంపిణీ చేశారు. అర్హత లేకపోయినా కొంతమంది దివ్యాంగుల పేరుతో ధృవప్రతాలు సంపాదించి పింఛన్లు పొందుతున్నారు.

AGITATION: త్వరగా వెరిఫికేషన చేయాలి
Pensioners' agitation at Sadaram camp

కదిరి అర్బన, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): గంటల కొద్దీ త్వరగా వెరిఫికే షన పూర్తి చేయాలని దివ్యాంగ పింఛన దారులు సోమవారం స్థానిక ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. వైసీపీ పాలనలో ఇష్టారాజ్యంగా పింఛన్లు పంపిణీ చేశారు. అర్హత లేకపోయినా కొంతమంది దివ్యాంగుల పేరుతో ధృవప్రతాలు సంపాదించి పింఛన్లు పొందుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ పింఛన్లపై విచారణ చేపట్టింది. సదరమ్‌ క్యాంపు ద్వారా రీ వెరిఫికేషన చేపట్టారు. కదిరి ఏరియా ఆసుపత్రిలో సోమవారం నిర్వహించిన సదరమ్‌ క్యాంపు వద్దకు రీ వెరిఫికేషన కోసం వందలమంది పింఛన దారులు వచ్చారు. ఒకే డాక్టర్‌ పరిశీలిస్తుండడంతో ఇబ్బంది పడిన పించన దారులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నామని, త్వరగా వెరిఫికేషన చేయాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న ఆసుపత్రి సూపరిండెంట్‌ విజయలక్ష్మి ఆందోళన కారులతో మాట్లాడారు. రోజుకు 40నుంచి 50మాత్రమే చేయగలమని, వందలమంది వస్తే ఒక డాక్టర్‌తో సాధ్యం కాదన్నారు. అధికారుల సమన్వయంతో రోజువారీ టోకన్లు ఇస్తామని, ఏ రోజు టోకన్లు తీసుకున్న వారు ఆ రోజు మాత్రమే రావాలని సూచించారు.

Updated Date - Aug 19 , 2025 | 12:35 AM