MLA MS RAJU: అభివృద్ధి పనులపై విజిలెన్స విచారణ చేయిస్తాం
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:57 PM
వైసీపీ ప్రభుత్వంలో నగర పంచాయతీ పరిధిలో రూ.లక్షలోపు జరిగిన పనులకు సంబంధించి విజిలెన్స ఎంక్వైరీ చేయిస్తామని ఎమ్మెల్యే ఎంఎ్‌స రాజు అన్నారు. శనివారం నగరపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మడకశిర టౌన, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో నగర పంచాయతీ పరిధిలో రూ.లక్షలోపు జరిగిన పనులకు సంబంధించి విజిలెన్స ఎంక్వైరీ చేయిస్తామని ఎమ్మెల్యే ఎంఎ్‌స రాజు అన్నారు. శనివారం నగరపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసీపీ అనుసరించిన అప్రజాస్వామిక విధానాల వల్ల నగరపంచాయతీ పూర్తిగా నష్టపోయిందన్నారు. గట్టెక్కించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. నగర పంచాయతీలో అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టాలన్నా టెండర్లు వేయాలన్నారు. ఈ వ్యవహారంలో పూర్తిగా పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో మౌలిక సదుపాయాలు శాశ్వత అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. వర్షాకాలం కావడం వల్ల ప్రతి వార్డులో దోమలు నివారించేందుకు ఫాగింగ్ చేయాలని సూచించారు. తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వెంటనే చేపట్టాలన్నారు. పట్టణంలో జరగవలిసిన అభివృద్ధి పనులకు సంబంధించి తీర్మానాలు చేశారు. నగర పంచాయతీ చైర్మన నరసింహరాజ, కమిషనర్ జగన్నాథ్, వైస్ చైర్మన వెంకటలక్ష్మమ్మ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరం
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే ఎం.ఎ్‌స.రాజు అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ అవరణలో సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 44మంది లబ్ధిదారులకు రూ,14.52 లక్షల చెక్కుల పంపిణీ చేశారు రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన చైర్మన లక్ష్మీనారాయణ, కన్వీనర్ నాగరాజు, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, డాక్టర్ క్రిష్ణమూర్తి, సింగల్ విండో అధ్యక్షుడు, నాయకులు పాల్గొన్నారు.