Share News

GANESH: మొదలైన చవితి సందడి

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:06 AM

పట్టణంలో చవితి సందడి మొదలైంది. వాడవాడలా, వీధివీధిన విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు యువకులు పోటీపడుతున్నారు. చవితి రోజు పూజా సామగ్రి కొనుగోలుకు యువత తరలి వస్తున్నారు. పట్టణంలోని వీధుల్లో వినాయక మండపాల ఏర్పాట్లలో యువత నిమగ్నమయ్యారు.

GANESH: మొదలైన చవితి సందడి
Workers in the construction of the Vinayaka Mandapa

రేపటి నుంచి వేడుకలు

పురంలో తొమ్మిదిరోజులు పూజలందుకోనున్న బొజ్జ గణపయ్య

పోటాపోటీగా విగ్రహాల ఏర్పాటు

హిందూపురం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): పట్టణంలో చవితి సందడి మొదలైంది. వాడవాడలా, వీధివీధిన విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు యువకులు పోటీపడుతున్నారు. చవితి రోజు పూజా సామగ్రి కొనుగోలుకు యువత తరలి వస్తున్నారు. పట్టణంలోని వీధుల్లో వినాయక మండపాల ఏర్పాట్లలో యువత నిమగ్నమయ్యారు. బుధవారం జరిగే వినాయక చవితి వేడుకకు ప్రజలు సిద్ధమయ్యారు. తొలిపూజతో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. హిందూపురంలో తొమ్మిది రోజులపాటు కన్నులపండువగా నిర్వహించేందుకు గణేష్‌ భక్త ఉత్సవ కమిటీల ప్రతినిధులు సిద్ధమయ్యారు. వినాయక విగ్రహాలను మండపాలకు తరలించేందుకు సోమవారం నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలోని హిందూపురంలో నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా సాగనుంది. ఒక పట్టణంలోనే 250దాకా విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. అందులో 10నుంచి 25అడుగుల విగ్రహాలు సుమారు వందకుపైగా ఉంటాయి. 25నుంచి 30అడుగుల విగ్రహాలు 20కిపైగా ఉంటాయి. వీటితోపాటు పట్టణ శివారు ప్రాంతాల్లో ఏర్పాటుచేసే విగ్రహాలు మరోవందదాకా ఉంటాయి. 3, 5, 7 నిమజ్జనం చేస్తారు. కానీ ఈసారి పెద్ద విగ్రహాలు తొమ్మిదిరోజులకు నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా పోలీసు లెక్కల ప్రకారం పల్లెలు, పట్టణాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు.


మండపాలు సిద్ధం

గతంలో పండుగరోజు సాయంత్రం వరకు వినాయక విగ్రహాల మండపాలు ఏర్పాటు చేసుకునేవారు. ఈసారి వాతావరణం అనుకూలించడంతో హిందూపురంలో సోమవారానికి 90శాతం మండపాలు సిద్దం చేశారు. మంగళవారం మధ్యాహ్నంకే విగ్రహాలు మండపాలకు తరలించేందుకు ఏర్పాట్లను ఉత్సవ కమిటీ సభ్యులు చేపట్టారు.

షామియానాలు, సారువ కట్టెలకు డిమాండ్‌

గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి మండపాలు పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం భవన నిర్మాణానికి ఉపయోగించే సారువకట్టెలను వాడుతున్నారు. ఒక్కో మండపానికి వందదాకా కట్టెలు ఏర్పాటుచేస్తున్నారు. దీనివల్ల ఒక హిందూపురం పట్టణంలోనే 20వేల కట్టెలుదాకా ఉపయోగిస్తున్నారు. హిందూపురంలో సరిపడా కట్టెలు లేకపోవడంతో కర్ణాటక రాష్ట్రం తుమకూరు, గౌరీబిదునూరు, పావగడ నుంచి తెప్పించుకుంటున్నారు. దీంతో బాడుగల ధరలు విపరీతంగా పెంచేశారు. అలాగే టార్పాలిన, షామియానాలు కూడా గిరాకీ పెరిగింది.

వినాయక విగ్రహాలకు పెరిగిన గిరాకీ

ప్రతియేటా వినాయక చవితిని పురస్కరించుకుని పట్టణాల్లో విగ్రహాల తయారీదారులు నాలుగైదు నెలల ముందుగానే పనులు ప్రారంభించారు. విగ్రహాలు తయారు చేసేవారు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికే వస్తారు. ప్లాస్టా్‌ఫప్యారీష్‌, మట్టి, జనపనారా, కొబ్బరిపీచుతో వీటిని వివిధరకాలుగా రూపొందించారు. ఈయేడాది వినాయక విగ్రహాలకు గిరాకీ పెరిగింది. ధరలు కూడా అమాంతంగా పెంచేశారు. ముడిసరుకు పెరిగాయని, గత యేడాదితోపోల్చితే విగ్రహం ధర 20నుంచి 30శాతం ధరలు పెంచినట్లు మండప నిర్వాహకులు అంటున్నారు.

Updated Date - Aug 26 , 2025 | 12:06 AM