ELECTRICITY: చేతికందే ఎత్తులో విద్యుత తీగలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:17 AM
కొన్నేళ్లుగా వ్యవసాయ పొలాల్లో విద్యుత తీగలు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి. దీనిపై పలుమార్లు ట్రాన్సకో అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపనపోలేదని తిమ్మాపురం రైతులు వాపోతున్నారు.
ఆందోళనలో రైతన్నలు
పెనుకొండ రూరల్, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): కొన్నేళ్లుగా వ్యవసాయ పొలాల్లో విద్యుత తీగలు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయి. దీనిపై పలుమార్లు ట్రాన్సకో అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపనపోలేదని తిమ్మాపురం రైతులు వాపోతున్నారు. రైతులు శ్రీనివాసులు, రాజు మాట్లాడుతూ పాత జాతీయరహదారి నుంచి వ్యవసాయ పొలాల్లోకి వెళ్లాలంటే వ్యవసాయ పొలాల్లో విద్యుత తీగలు వేలాడుతున్నాయని, వాటికి స్తంభాలు ఏర్పాటుచేసి సరిచేయాలని వేడుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇటీవల గ్రామంలో మృతదేహాన్ని ఖననం చేసేందుకు తీసుకెళ్లే సమయంలో కూడా కట్టెలతో తీగలను ఎత్తి పట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్థులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత అధికారులు స్పందించి తీగలను సరిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.