Home » Puttaparthy
‘ఊరూరా గంజాయి’ శీర్షికన ఈనెల 17వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ రెండ్రోజుల క్రితం ప్రచురించిన కథనంతో అధికారుల్లో చలనం వచ్చింది. దీంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
రోగులకు మెరుగైన సేవలందించాలని డీఎంహెచఓ ఫైరోజ్ బేగం సూచించారు. శనివారం మండలంలోని పట్నం ప్రభుత్వం ఆసుపత్రి, కుటాగుళ్ల ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు.
మహిళల ఆర్థికాభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం గోకులాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. శనివారం మండలంలోని గోళ్లవారిపల్లి, కోటూరు గ్రామాల్లో మహిళా రైతుల కోసం నిర్మించిన గోకులం షెడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల విషయంలో నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ టీఎస్ చేతన హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 215 అర్జీలను కలెక్టర్ స్వీకరించారు.
: ప్రజోపకార్యాలకు ఉపయోగించాల్సిన ప్రభుత్వ నిధులను యథేచ్ఛగా స్వాహా చేశారు. పంచాయతీ ప్రజాప్రతినిధికి కొందరు నాయకులు తోడై ప్రజల సొమ్మును మింగేశారు. స్తానిక పంచాయతీ నిధులు పక్కదారి పట్టిన విషయం బయటికి పొక్కడంతో శనివారం పెనుకొండ డీఎల్‌పీఓ శివనారాయణరెడ్డి విచారణ చేపట్టారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఆహార భద్రతతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పెనుకొండ, రొద్దంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీ బీకే పార్థసారథితో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు.
అణగదొక్కాలని చూస్తే సహించబోమనీ, చేనేత కులాల సత్తా ఏంటో చూపుతామని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఉద్ఘాటించారు. స్థానిక శివానగర్‌లోని శివాలయం వద్ద పట్టణ చేనేత కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఎమ్యెల్యే కందికుంట ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నూతనసంవత్సరంలో న్యాయంకోసం పోలీసుస్టేషన్లకు వచ్చే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపి, పోలీస్ మార్కు కనిపించాలని ఎమ్మెల్యే పల్లె సిందూరరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు.
మండలంలోని కునుకుంట్ల పాఠశాలలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్య క్తులు పాఠశాల ఆవరణ లో ఎనుముకు సంబంధించిన పుర్రె, కాళ్ల ఎముకలు ముగ్గుపై ఉంచి పసుపు కుంకుమ చల్లి క్షుద్రపూజలు నిర్వహించారు.
నూతన సంవత్సరంలో నూతనోత్సాహంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎస్పీ రత్న పోలీసు అధికారులకు సూచించారు.