BC COMMUNITY: బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:31 AM
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ డిమాండ్ చేశారు.
పుట్టపర్తి టౌన, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ డిమాండ్ చేశారు. శుక్రవా రం కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ టీఎస్ చేతనకు వినతిపత్రం అందించారు. ఆమె మా ట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీ కులగణన చేసి, జనాభా దామాషా ప్ర కారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బీసీలకు ప్ర త్యేక రక్షణ చట్టం అమలు చేయాలన్నారు. ఆమెతోపాటు బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా నాగరాజు, నామాల శంకర్, తిరుపతయ్య, వెంకటరమణ, గిరిరాజు రవి, బండి వెంకటేష్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.