Share News

CITU: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పించాలి

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:30 AM

సివిల్‌ సప్లై స్టాక్‌పాయింట్‌లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న డీఈఓ, సెక్యూరిటీ, పంప్‌ బాయ్స్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ డిమాండ్‌ చేశారు.

CITU: ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పించాలి

పెనుకొండ, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యయతి): సివిల్‌ సప్లై స్టాక్‌పాయింట్‌లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న డీఈఓ, సెక్యూరిటీ, పంప్‌ బాయ్స్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక సివిల్‌ సప్లై గోడౌనవద్ద లక్ష్మీపతి అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ కార్పొరేషన పరిధిలో పనిచేసే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు భద్రత కల్పించాలన్నారు. స్టాక్‌పాయింట్‌ పరిధిలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్నా ఎటువంటి గుర్తింపు లేకుండా వెట్టిచాకిరి చేయించడం బాధాకరమన్నారు. వీరికి జాతీయ సెలవులుకానీ, పండగ సెలవులుకానీ, టీఏ, డీఏలు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. స్టాక్‌పాయింట్‌లో ఏ పొరపాటు జరిగినా గోడౌన ఇనచార్జిలు తప్పించుకుని డీఈఓలపై నెపం వేస్తున్నారన్నారు. సెక్యూరిటీగార్డ్‌లకు ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం, బదిలీలు చేసి ఇబ్బందికి గురిచేయడం మంచిదికాదన్నారు. దీనిపై జేసీకి వినతిపత్రం అందించనున్నట్లు తెలిపారు. అనంతరం అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరూ వెంకటేశులు, నాగరాజు, బాబావలి ఆధ్వర్యంలో సీఐటీయూలో చేరారు.

నూతన జిల్లా కమిటీ ఏర్పాటు: సివిల్‌ సప్లై గోడౌన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సమీవుల్లా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీపతి, కోశాధికారిగా శివానంద, ఉపాధ్యక్షులుగా శ్రీలక్ష్మి, వీరభద్ర, సహాయ కార్యదర్శులుగా మహబూబ్‌బాషా, రెడ్డిశేఖర్‌లను ఎన్నుకున్నారు. యూనియన జిల్లా కార్యదర్శి నాగరాజు, మండల కన్వీనర్‌ బాబావలి, డీఈఓలు, సెక్యూరిటీగార్డ్‌లు, పంప్‌బాయ్స్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 14 , 2025 | 12:31 AM