WEAVERS ASSOCIATION: చేనేతలకు ఉచిత విద్యుత అమలు చేయాలి
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:52 PM
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 200యూనిట్ల ఉచిత విద్యుత అమలు చేయాలని చేనేతలు కోరారు. ఆగస్టు నుంచి అమలులోకి వచ్చిన ఉచిత విద్యుత పథకం అధికారికంగా అమలు కాలేదన్నారు.
సోమందేపల్లి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 200యూనిట్ల ఉచిత విద్యుత అమలు చేయాలని చేనేతలు కోరారు. ఆగస్టు నుంచి అమలులోకి వచ్చిన ఉచిత విద్యుత పథకం అధికారికంగా అమలు కాలేదన్నారు. విద్యుతశాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఉచిత విద్యుత తమకు పథకం వర్తించలేదని ఆ సంఘం నాయకుడు నారాయణస్వామి విమర్శించారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో చేనేతలతో కలిసి డీటీ రెడ్డిశేఖర్‌కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ 7వ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ఉచిత విద్యుత హామీని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారన్నారు. అది అమలుకు నోచుకోలేదన్నారు. 50ఏళ్లు నిండిన నేతన్నకు పింఛన అందించాలన్నారు. చేనేత భరోసా పథకం కింద రూ.20వేలు పెట్టుబడిసాయం అందించాలన్నారు. దాసరి సుధాకర్, మా మిళ్ల శ్రీనివాసులు, ఈశ్వర్, బెస్త కిష్టప్ప, కుమ్మరికిష్టప్ప, ఈడిగ నాగరాజు, వడ్డి నాగరాజు, మల్లికార్జున, బెస్త వెంకటేశ్వర్లు, ఖాసీం పాల్గొన్నారు.