PARITALA SRIRAM: చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:32 AM
ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. మండలంలోని రామాపురం గ్రామ జడ్పీ పాఠశాలలో శుక్రవారం ఏపీ బాల్ బ్యాడ్మింటన అసోసియేషన ఆధ్వర్యంలో బాల్‌బ్యాడ్మింటన పోటీలు ప్రారంభమయ్యాయి.
బత్తలపల్లి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. మండలంలోని రామాపురం గ్రామ జడ్పీ పాఠశాలలో శుక్రవారం ఏపీ బాల్ బ్యాడ్మింటన అసోసియేషన ఆధ్వర్యంలో బాల్‌బ్యాడ్మింటన పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలను పరిటాల శ్రీరాం ప్రారంభించారు. అయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు పాఠశాల దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడలు ఎంత బాగా ఆడితే అంత ఆరోగ్యాంగా ఉంటామన్నారు. జాతీయ స్థాయిలో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. డైరక్టర్ గోనుగుంట్ల విజయ్‌కుమార్, నారాయణరెడ్డి, ఉమాపతి నాయుడు, కేశవ, రమణ, మోహన, అప్పస్వామి, అశోక్ పాల్గొన్నారు.
బాధితుడికి పరామర్శ
తాడిమర్రి(ఆంధ్రజ్యోతి): సూపర్‌సిక్స్-సూపర్‌హిట్ సభకు వెళ్లి తిరిగివస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన పెద్దకోట్ల గ్రామానికి చెందిన మోపుర్‌రెడ్డిని ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ శుక్రవారం పరామర్శించారు. బత్తలపల్లి ఆర్డీటీ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా అక్కడికి వెళ్లి పరామర్శించి స్థానిక వైద్యులతో ఆరాతీశారు. అనంతరం బాధితునికి రూ.20వేలు ఆర్థికసాయం అందించి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూచి రాము, హర్షవర్ధన, భాస్కర్‌గౌడ్, గణేశ, పక్కీర్‌రెడ్డి, వీరాంజి, క్రిష్టయ్య, పెద్దపార్థ పాల్గొన్నారు.