EX MLC: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:26 AM
సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. శనివారం బాలాజీనగర్‌లోని టీడీపీ కార్యాలయంలో గుడిబండ మండలం, ఎస్.రాయపురం గ్రామానికి చెందిన పలువురు వైసీపీకి రాజీనామా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
మడకశిర టౌన, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి):సీఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. శనివారం బాలాజీనగర్‌లోని టీడీపీ కార్యాలయంలో గుడిబండ మండలం, ఎస్.రాయపురం గ్రామానికి చెందిన పలువురు వైసీపీకి రాజీనామా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువాలు వేసి గుండుమల సాదరంగా ఆహ్వానించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందన్నారు. వైసీపీ పాలనలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారన్నారు. ఎస్.రాయపురం గ్రామానికి చెందిన నాగరాజు, భారతితో పాటు 5 కుటుంబలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివా్‌సమూర్తి, తమ్మన్న పాల్గొన్నారు.