డ్వాక్రాసంఘాల సృష్టికర్త చంద్రబాబు
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:01 AM
డ్వాక్రా సంఘాల సృష్టికర్త సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు.ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో డ్వాక్రా సంఘాలను సీఎం ప్రవేశపెట్టారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 270మంది యానిమేటర్లకు బయోమెట్రిక్ డివై్‌సలను పంపిణీ చేశారు.
మడకశిర టౌన, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): డ్వాక్రా సంఘాల సృష్టికర్త సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు.ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో డ్వాక్రా సంఘాలను సీఎం ప్రవేశపెట్టారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 270మంది యానిమేటర్లకు బయోమెట్రిక్ డివై్‌సలను పంపిణీ చేశారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గు దస్తగిరితో కలసి ఎమ్మెఏల్యపాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో మహిళాసంఘాలను బలోపేతం చేయాలని, ప్రభుత్వం నుంచి వారు ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకు రుణాలు సకాలంలో అందేవిధంగా కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో వారికి అవసరమైన ప్రోత్సహం ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందారంటే కుటుంబంలో అందరూ బాగుంటారని సీఎం విశ్వాసం అన్నారు. మహిళలకు సంఘాల ద్వారానే కాక పారిశ్రామికంగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో మహిళా సాధికారత కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివా్‌సమూర్తి, వక్కలిగా కార్పొరేషన చైర్మన లక్ష్మీనారాయణ, మండల కన్వీనర్ నాగరాజు, ఈరన్న, తిప్పేస్వామి, పట్టణ అధ్యక్షడలు నాగరాజు, కుమార్‌స్వామి, గణేష్ పాల్గొన్నారు.