GANESH : ఘనంగా హిందూ మహాగణపతి శోభాయాత్ర
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:24 AM
స్థానిక పాత పంచాయతీ కార్యాలయం ఆవరణలో హిందూ మహాగణపతి సంఘం ఏర్పాటు చేసిన మహాగణపతి శోభాయాత్ర శనివారం ఘనంగా నిర్వహించారు.
అమరాపురం, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక పాత పంచాయతీ కార్యాలయం ఆవరణలో హిందూ మహాగణపతి సంఘం ఏర్పాటు చేసిన మహాగణపతి శోభాయాత్ర శనివారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో వినాయకుని సేవలు చేయడం ద్వారా గ్రామంలో ప్రశాంతత లభిస్తుందన్నారు. అమరాపురం పట్టణంలోని ప్రధాన పురవీధుల్లో శోభాయాత్ర సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల నృత్యప్రదర్శన, డీజే కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా శోభయాత్రను నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్‌ఐ ఇషాక్‌బాషా బందోబస్తు నిర్వహించారు. మహాగణపతి యువక సభ్యులు, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు, శ్రీనివాస్, మూర్తి, హరీష్, హనుమంతరాయ పాల్గొన్నారు.
అగళి(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శనివారం వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. వినాయకుడిని పురవీధుల గుండా రంగులు చెల్లుకుంటూ ఊరేగింపుగా తీసుకెళ్లారు. టీడీపీ జడ్పీటీసీ ఉమే్‌షతోపాటు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దగ్గరలోని చెరువులో గణేశుడిని నిమజ్జనం చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు.