IRRIGATION: చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:54 PM
మండలంలో 30చెరువుల మరమ్మతుకు రూ.20కోట్లతో ప్రణాళికలు రూపొందించామని ఇరిగేషన ఏఈ వినోద్‌కుమార్ తెలిపారు. సోమవారం మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నాగమ్మ అధ్యక్షతన నిర్వహించారు.
రొద్దం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): మండలంలో 30చెరువుల మరమ్మతుకు రూ.20కోట్లతో ప్రణాళికలు రూపొందించామని ఇరిగేషన ఏఈ వినోద్‌కుమార్ తెలిపారు. సోమవారం మండల సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ నాగమ్మ అధ్యక్షతన నిర్వహించారు. రూ.8లక్షలతో చెరువు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. వైఎ్‌సఆర్ లేఅవుట్ వద్ద చెరువు కాలువ ఆక్రమణకు గురైందని సింగిల్‌విండో అధ్యక్షుడు వీరాంజనేయులు పేర్కొనగా వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఉదయ్‌శంకర్‌రాజ్ సమాధానం ఇచ్చారు. దొడగట్ట ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని కలిపి సింగిల్‌విండో అధ్యక్షుడు రామచంద్ర ఎంఈఓ విజయభాస్కర్‌ను కోరారు. రొద్దంలో ఐదుచోట్ల సోలార్ సబ్‌స్టేషనలకు పదెకరాలు చొప్పున భూమి కేటాయిస్తామని తెలిపారు. బొక్సంపల్లిలో 5500 ఎకరాలు సోలార్ ఏర్పాటుకు ప్రభుత్వం సర్వేచేసినట్లు తహసీల్దార్ తెలిపారు. మార్కెట్‌యార్డ్ చైర్మన రామక్రిష్ణప్ప, జడ్పీటీసీ పద్మావతి, ఎంపీడీఓ రామకుమార్, డైరెక్టర్ తిరుపాల్‌నాయుడు, హౌసింగ్ ఏఈ ఖాజామైనొద్దీన, ఏపీఎం జయచంద్ర, పశువైద్యాధికారి జాహ్నవి, సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.