LOK ADALATH: రాజీమార్గం.. ఉత్తమం
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:28 AM
కేసుల పరిష్కారంలో రాజీమార్గం ఎంతో ఉత్తమమని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో మెగా లోక్‌అదాలత నిర్వహించారు. 95కేసులు పరిష్కారం చేశారు.
హిందూపురం, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): కేసుల పరిష్కారంలో రాజీమార్గం ఎంతో ఉత్తమమని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో మెగా లోక్‌అదాలత నిర్వహించారు. 95కేసులు పరిష్కారం చేశారు. ఇందులో రెండు క్రిమినల్ అప్పీల్‌ద్వారా బాదితునికి రూ.4లక్షలు అందజేశారు. ఎనిమిది సివిల్ కేసులు పరిష్కరించి రూ.29.90లక్షలు అందించారు. ఆరు చెక్‌బౌన్స కేసులుపరిష్కరించి రూ.48.90లక్షలు ఇప్పించారు. ఒక టీవీసీ కేసు పరిష్కరించి బాధితురాలికి రూ.5లక్షలు అందించారు. వీటితోపాటు 59మద్యం కేసులు పరిష్కరించి రూ.2.57లక్షలు అపరాధ రుసుం విధించారు. ఎనిమిది బ్యాంక్ కేసులు పరిష్కరించి రూ.3.37లక్షలు బ్యాంకుకు జమచేయించారు. సీనియర్ సివిల్ న్యాయాధికారి వెంకటేశ్వర్లునాయక్, ప్రత్యేక న్యాయాధికారి రమణయ్య, ఏపీపీలు, న్యాయవాదులు పాల్గొన్నారు.
100 కేసుల పరిష్కారం
మడకశిర టౌన(ఆంధ్రజ్యోతి): మడకశిర జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ మెగా లోక్ అదాలతలో 100 కేసులు పరిష్కారమైనట్లు కోర్టు సిబ్బంది తెలిపారు. జూనియర్ సివిల్ న్యాయాధికారి ఆర్.అశోక్‌కుమార్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 19 క్రిమినల్ కేసులకు సంబంధించి రూ.26,000 జరిమానా వేసినట్లు తెలిపారు. ఎస్‌టీసీ 12 కేసులకు రూ,11,500, 5 సివిల్ కేసులు పరిష్కరించామన్నారు. ఎక్సైజ్ కేసులు 65కు గాను రూ.4,18 లక్షలను రికవరీ చేసినట్లు తెలిపారు. న్యాయవాదులు త్రిలోక్, భాస్కర్, గోపీ, లోకేష్, హనుమంతరాయప్ప పాల్గొన్నారు.