Home » Puttaparthi
జిల్లాలోని అన్ని అంగనవాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, లేక పోతే చర్యలు తప్పవని ఐసీడీఎస్ పీడీ ప్రమీల అంగన్వాడీ కార్య కర్తల కు సూచించారు. జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో శనివా రం అంగనవాడీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
జిల్లాలో గ్రామం ఇన్సూరెన్సు యూనిట్‌గా పంటకోత ప్రయోగాలు చేపట్టేందుకు కందిపం టను ఎంపిక చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి రామునాయక్, జిల్లా ఆర్థిక గణాంకాధికారి (సీపీఓ) విజయ్‌కుమార్ పేర్కొన్నారు. పంటకోత ప్రయోగాలపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ఎం పీడీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని టీడీపీ నాయకులు డి మాండ్ చేశారు.
గర్భిణులు, బా లింతలు పోషకవిలువలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవా లని సీడీపీఓ జయంతి, మునిసిపల్ కమిషనర్ క్రాంతి కుమార్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రశాంతిగ్రాంలో మంగళవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘పోషణ పక్వాడా, భేటీ బచావో- భేటీ పఢావో’ కార్యక్రమం నిర్వహించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం ద్వారా జీఎస్టీ తగ్గి మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూర్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎంశేఖర్ తెలిపారు. పుట్టపర్తిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
పరిశ్రమల ఏర్పాటుకు శ్రీసత్యసాయి జిల్లా అనుకూలమైన ప్రాంతమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. సభలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి పుష్కలంగా ఉందన్నారు.
మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం జన్మదిన వేడుకలను అభిమానుల మధ్య అట్టహాసంగా జరుపుకున్నారు. పలువురు పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతి నిధులు, అదికారులు, ఉద్యోగులు, వ్యాపారులు, యువత, ఆటో డ్రైవర్లు, రా జకీయ నాయకులు భారీ పూలమాలలు, కేక్‌లను పట్టణంలోని పల్లె క్యాం పు కార్యాలయానికి తీసుకెళ్లి ఆయనను ఘనంగా సన్మానించారు.
మండల పరిధిలోనిలో చెరువుకు ఎమ్మెల్యే పల్లె సిధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘనాథ్‌రెడ్డి ఆదేశాలతో ఇరిగేషన, హంద్రీనీవా అధికారులు హంద్రినీవా కాలువద్వారా నీటిని విడు దల చేశారు. గురువారం చెరువు నిండి మరువ పారుతోంది.
ప్రపంచపు తొలి వాస్తు శిల్పి, సృష్టికర్తగా పేరొందిన విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలను జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలతో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు విశ్వ కర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన కార్యక్ర మాన్ని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ప్రారంభించారు. కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ సం యుక్త భాగస్వామ్యంలో నిర్వహంచనున్న ఈ కార్యక్రమ పోస్టర్లను జేసీ అభిషేక్ కుమార్, రాష్ట్ర నో డల్ ఆఫీసర్, అడిషనల్ డైరక్టర్ డాక్టర్ అనిల్‌కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఫైరోజ్‌బేగం, ఐసీడీఎప్ పీడీ ప్రమీల, డిప్యూటీ డీఎం హెచఓ డాక్టర్ పీఎస్ మంజువాణి, ఆర్డీఓ సువర్ణ, వైద్యాధి కారులు డాక్టర్ సునీల్ విడుదల చేశారు.