DSP: చట్టాలపై అవగాహన ఉండాలి
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:16 AM
చట్టాలపై విద్యార్థులు అవగా హన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళా పోలీసు స్టేషన డీఎస్పీ ఇందిర సూచించారు. జాతీయ బాలికా దినోత్సవ సంద ర్భంగా ఎస్పీ సతీశకుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఇందిర శనివారం పోలీస్ సిబ్బంది, ధర్మవరం శక్తిటీం-1తో కలిసి పట్టణంలోని పద్మావతి మహిళా డిగ్రీకళాశాలలో శనివారం చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
- బాలికా దినోత్సవంలో మహిళా పోలీస్ స్టేషన డీఎస్పీ
ధర్మవరం, జనవరి 24(ఆంధ్రజ్యోతి): చట్టాలపై విద్యార్థులు అవగా హన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళా పోలీసు స్టేషన డీఎస్పీ ఇందిర సూచించారు. జాతీయ బాలికా దినోత్సవ సంద ర్భంగా ఎస్పీ సతీశకుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఇందిర శనివారం పోలీస్ సిబ్బంది, ధర్మవరం శక్తిటీం-1తో కలిసి పట్టణంలోని పద్మావతి మహిళా డిగ్రీకళాశాలలో శనివారం చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ విద్యార్థులకు పలు చట్టాలు, పోక్సో కేసుపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. అంతకుమునుపు విద్యార్థి నిలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున, అధ్యాపకులు రంగారెడ్డి, రాధారాణి, పార్థసారఽథి, వాణి, మహమ్మద్‌రఫీ, హరి, ఉష, ప్రత్యూష, చంద్రిక, రామాంజినేయులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....