Share News

MLA: ప్రజల సంతోషమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:06 AM

గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయయమని ఎమ్మెల్యే కందికుం ట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. మండలపరిధిలోని గూటిబైలు సమీపంలో వెలసిన తిమ్మమ్మమర్రిమాను వద్ద శనివారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన వివిధ సమస్యలపై వినతులు స్వీకరిం చారు.

MLA: ప్రజల సంతోషమే ప్రభుత్వ ధ్యేయం
MLA Kandikunta listens to people's problems

- ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే కందికుంట

నంబులపూలకుంట, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయయమని ఎమ్మెల్యే కందికుం ట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. మండలపరిధిలోని గూటిబైలు సమీపంలో వెలసిన తిమ్మమ్మమర్రిమాను వద్ద శనివారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన వివిధ సమస్యలపై వినతులు స్వీకరిం చారు. గృహనిర్మాణ బిల్లులు, భూసమస్యలు, ఒంటరి మహిళల పింఛన్లకు దాదాపు 20 వినతులు వచ్చినట్లు ఆయన తెలిపారు. శ్మశాన వాటికకు సీఎస్‌ఆర్‌ నిధులతో రోడ్డు వేయిస్తామని తెలిపారు. గ్రామాల్లో నెలకున్న చిన్నచిన్న సమస్యలను నాయకుల సమన్వ యంతో పరిష్క రించాలని అఽధికారులకు సూచించారు. నాయకులు పక్షపాతం లేకుండా తమ వంతు సహకరించాలన్నారు.


తిమ్మమ్మ మర్రిమాను గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడానికి తనవంతుగా కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ యేడాది మహా శివరాత్రి సందర్భంగా తిరునాళ్లను అంగరంగ వైభవం గా నిర్వహించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మమఆయనతో పాటు తహసీల్దార్‌ దేవేంద్రనాయక్‌, ఎంపీడీఓ పార్థసారథి, టీడీపీ మండల కన్వీనర్‌ శ్రీరాముల నాయుడు, సర్పంచ విష్ణుమూర్తి, ఆలయ కమిటీ సభ్యులు వెంకటనారాయణ, శ్రీనివాసులు, నారాయణస్వామి, క్లస్టర్‌ ఇనచార్జ్‌ దండే రవి, రంగారెడ్డి, పౌల్‌రెడ్డి, చౌదరి, రమణ, పోమేనాయక్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Andhrajyothi, News, Anantapur, puttaparthi, Andhrapradesh, mla

Updated Date - Jan 25 , 2026 | 12:07 AM