GOD: భక్తులతో కిటకిటలాడిన పాలపాటిదిన్నె
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:10 AM
మండలంలో ప్రసిద్ధి చెందిన పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిట లాడింది. ఈ సందర్భంగా అర్చకులు మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అ లంకరించి పూజలు చేశారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లిం చారు.
నల్లచెరువు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): మండలంలో ప్రసిద్ధి చెందిన పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిట లాడింది. ఈ సందర్భంగా అర్చకులు మూలవిరాట్‌ను ప్రత్యేకంగా అ లంకరించి పూజలు చేశారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లిం చారు. ప్రతి శనివారం ఆలయంలో ఉచిత అన్న ప్రసాదం, భజనలకు చెల్లించే విరాళాలను నేరుగా ఆలయ సిబ్బందికి ఒక రోజు ముందే అందజేసి, రసీదు పొందాలని ఆలయ ఈఓ శివరామరాజు భక్తులకు విన్నపం చేశారు. వారి కుటుంబ సభ్యుల పేరు మీద శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు పంపుతామన్నారు. విరాళాలను ఆలయానికి సంబంధంలేని వ్యక్తుల చేతికి ఇచ్చి మోసపోవద్దని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....