TURNS: ప్రమాదకరంగా మలుపులు
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:36 PM
ఆ గ్రామాలకు వెళ్లే రహదారుల గుండా ప్రజలు భయంభయంగా ప్రయాణిస్తున్నారు. తర చూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా నివారణకు అధికారులు ఎటువం టి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆ రహదారు ల మలుపులు, స్పీడుబ్రేకర్లు వద్ద ఎటువంటి సూచిక బోర్డులు రేడియంస్టిక్కరు లేకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి.
- తరచూ ప్రమాదాలు - కానరాని సూచికలు- పట్టించుకోని అధికారులు
ధర్మవరంరూరల్, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ఆ గ్రామాలకు వెళ్లే రహదారుల గుండా ప్రజలు భయంభయంగా ప్రయాణిస్తున్నారు. తర చూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా నివారణకు అధికారులు ఎటువం టి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆ రహదారు ల మలుపులు, స్పీడుబ్రేకర్లు వద్ద ఎటువంటి సూచిక బోర్డులు రేడియంస్టిక్కరు లేకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి. అవి వాహనదారులకు రాత్రివేళాల్లో కనిపించక అదుపుతప్పి ప్రమా దాల బారిన పడుతున్నారు. పలువురు మృత్యువాత పడుతున్నారు.
అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలు
మండలంలోని ధర్మవరం - మామిళ్లపల్లి రహదారిలో కు ణుతూరు వద్ద మలుపు, ధర్మవరం నుంచి చిగిచెర్ల మీదుగా అనంతపురం వెళ్లే ప్రధాన రహదారి, ధర్మవరం - ఏలుకుంట్ల రహదారిలో నేలకోట, బి ల్వంపల్లి, ఏలుకుంట్ల చెరువు సమీపంలో ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఈ రహదారుల్లో ఎక్కడా ప్రమాద ప్రాంతాలను తెలిపే సూ చికలు లేవు. నిత్యం వందలాదిగా ద్విచక్రవాహనాలు, లారీలు, బస్సులు తిరుగుతుంటాయి. ఈ ప్రాంతాల్లో ఇటీవల తరచూ ప్రమా దాలు చోటుచేసుకుని పలువురు మృత్యువాతపడిన సంఘటనలు, అదే విధం గా తీవ్రగాయాల పాలైన వారూ ఉన్నారు.
రాత్రి వేళ ద్విచక్ర వాహన దారులకు చాలా దగ్గరకు వచ్చేంతవరకు ఆ రహదారుల్లో ఉన్న స్పీడ్ బ్రేకర్లు కనిపించక అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. వీటిపై తగు చర్యలు చేపట్టాలని కోరినా సంబంధిత అధికారులుగానీ, పోలీ సులు గానీ పట్టిం చుకోవడం లేదని ప్రజలు మండిపడు తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పం దించాలని వారు కో రుతున్నారు.
నివారణ చర్యలు శూన్యం
తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నిరె త్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టలేదని అంటున్నారు. ఈ నెల 15న కుణుతూరు సమీపంలో మలుపు వద్ద ధర్మవరం పట్టణానికి చెందిన సాయికిరణ్ అనే యువకుడు ద్విచక్రవాహనం అదుపుతప్పి అక్కడిక్కడే మృతిచెందాడు. నేలకోట, బిల్వంపల్లి, ఏలుకుంట్ల గ్రామ చెరువు సమీ పంలో మలుపుల వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే వాటిని అరికట్టడంలో పోలీసులు, ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం- రాజశేఖర్, ఎస్‌ఐ, ధర్మవరం రూరల్
ఎస్పీ ఆదేశాల మేరకు ఇప్పటికే మండలంలోని ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాం. ఆ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా తగు చర్య లు తీసుకుంటాం. రోడ్డుప్రమాదాల నివారణలో భాగంగా స్పీడ్ బ్రేకర్లు, మలుపులు వాహనదా రుల కు కనిపించేవిధంగా రేడియం స్టిక్టర్లు ఏర్పాటుచే యిస్తాం. ద్విచక్రవాహనదారులు వేగాన్ని తగ్గించి, హెల్మెట్ తప్పని సరిగా ధరించి వాహనాలు నడిపితే ప్రమాదాలు నివారించవచ్చు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....