Share News

TAP: అక్రమంగా కొళాయి కనెక్షన్లు

ABN , Publish Date - Jan 26 , 2026 | 11:37 PM

స్థానిక మున్సిపాలిటీ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ కొళాయి కనెక్షనలు వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా కొళాయి కనెక్షనలు తీసుకుంటున్నా అ ్డడిగే వారేలేరు. సాధారణంగా మున్సిపాలిటీలో రూ.500లోపల ఇంటి పన్ను చెల్లించేవారు రూ. 1250, ఆ పైన చెల్లించేవారు రూ. 9వేలను ఆనలైన ద్వారా మున్సిపాలిటీకి చెల్లించాలి.

TAP: అక్రమంగా కొళాయి కనెక్షన్లు
Cover image of Dharmavaram

- విచ్చలవిడిగా తీసుకుంటున్నా పట్టించుకోని అధికారులు

- మున్సిపల్‌ ఆదాయాని భారీ గండి

- ఇబ్బందులు పడుతున్న పన్ను చెల్లిస్తున్న వారు

ధర్మవరం, జనవరి 26(ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిపాలిటీ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ కొళాయి కనెక్షనలు వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా కొళాయి కనెక్షనలు తీసుకుంటున్నా అ ్డడిగే వారేలేరు. సాధారణంగా మున్సిపాలిటీలో రూ.500లోపల ఇంటి పన్ను చెల్లించేవారు రూ. 1250, ఆ పైన చెల్లించేవారు రూ. 9వేలను ఆనలైన ద్వారా మున్సిపాలిటీకి చెల్లించాలి. అప్పుడే కొళాయి కనెక్షనకు అనుమతులు ఇస్తారు. అవేవీ ఇక్కడ కనిపించవు. అయినా మున్సిపా లిటీలో పనిచేసే కిందిస్థాయి సిబ్బందే కొళాయి కనెక్షనలు ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా పెద్ద ఎత్తున అక్రమ కొళాయిలు పుట్టుకొస్తుండటంతో మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండిపడుతోం దని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపాలిటీలోని ప్రధాన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్ని స్తున్నారు. ప్రతి ఏటా పట్టణంలో తాగునీటి కోసం ప్రభుత్వం రూ. లక్ష ల నిధులు ఖర్చు చేస్తోంది. పట్టణంలో నీటి పన్ను రూపంలో కేవలం రూ.5కోట్లు మాత్రమే ఆదాయం వస్తోంది. ఆస్తి పన్ను రూ.7కోట్లు వ స్తోంది. అదేవిధంగా ఇతరత్రా వాటితో వచ్చే ఆదాయాన్ని మున్సిపాలిటీ పరిధిలో నీటిసరఫరా కోసం ఎక్కువ శాతం ఖర్చు చేస్తున్నారు. ఇ లాంటి పరిస్థితుల్లో నీటి పన్ను నుంచి ఆదాయం పెంచుకోవడానికి అధికారులు ప్రయత్నిచ డం లేదని పలువురు విమర్శిస్తున్నారు. నెలకు రూ. వేల మామూళ్లు వసూలు అవుతున్నా యంటే నీటి దోపిడీ ఏ స్థా యిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


అక్రమాలను గుర్తించి అడ్డుకో వడానికి అవకాశం ఉన్నా సచివాలయ ఇంజనీర్లు పట్టించుకోవడం లే దన్న ఆరోపణలు ఉన్నాయి. ధర్మవరం మున్సిపాలిటీలో 40 వార్డులు ఉన్నాయి. జనాబా 1.5లక్షలు. 14 ట్యాంకులు ఉన్నాయి. రోజుకు 22 ఎంఎల్‌టీ నీరు. సరఫరా అవుతోంది. తాగునీటి సరఫరా, మరమ్మతులు ఇతరత్రా వాటి కోసం ప్రతియేటా రూ.30లక్షలు ఖర్చుచేస్తున్నట్టు మున్సిపాలిటీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

పార్నపల్లి రిజర్వాయర్‌ నుంచి సరఫరా

తాడిమర్రి మండలంలోని పార్నపల్లి సమీపంలో చిత్రావతి బ్యాలె న్సింగ్‌ రిజర్వాయర్‌ వద్ద పంపింగ్‌ చేయడంతో నీరు బత్తలపల్లి మండ ల తంబాపురం చేరుతుంది. అక్కడి నుంచి పంపింగ్‌ ద్వారా పట్టణం లోని తిక్కస్వామినగర్‌లో నిర్మించిన కేతిరెడ్డి సూర్యప్రతాప్‌రెడ్డి పంప్‌ హౌస్‌కు పంపుతారు. ఇక్కడ దాదాపు పది నీటితొట్టెల్లో శుద్ధిచేసిన అనంతరం పట్టణంలో ఉన్న 14 తాగునీటి ట్యాంకులను రోజుకు 22 ఎంఎల్‌టీ లీటర్ల నీటితో నింపి, పట్టణ ప్రజలకు సరఫరా చేస్తున్నారు. వీటికోసం రూ. కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నారు. సుదూర ప్రాంతం నుంచి వచ్చిన తాగునీరు వృథా చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్య త పట్టణ ప్రజలతో పాటు ఇంజనీరింగ్‌ సిబ్బందిపై ఉంది. కానీ అక్రమ కనెక్షన్లతో నీటితో పాటు ప్రజాధనం వృధాగా అవుతోంది.

మున్సిపాలిటీ ఆదాయానికి గండి

: మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారుల లెక్క ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో 26 నీటికొళాయిలు ఉన్నట్టు రికార్డుల లెక్కలు చెబుతున్నాయి. పట్టణంలో దాదాపు 40వేల వరకు నివాస గృహాలతో పాటు వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. దాదాపు అన్నింటికి కొళాయిలు ఉన్నాయి. ఈ లెక్కన అక్రమ కనెక్షనలు అధికంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అక్రమ కనెక్షనలను అరికట్టాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు లేకపోలేదు. వీటి వల్ల మున్సిపాలిటీ ఆదాయానికి రూ.కోట్లు గండిపడడమే కాకుండా, నీటి పన్ను చెల్లిస్తున్న వారికి నీరు సక్రమంగా సరఫరా కాక ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తు న్నారు.


లాడ్జిలు, హోటళ్లు, దుకాణాలు, ఫ్యాక్టరీలు, కల్యాణమండప పా లు తదితర వాటికి ఇచ్చిన కొళాయి కనెక్షన్లను వాణిజ్య విభాగం కింద పరిగణించాలి. మీటర్లను అమర్చి, కిలో లీటర్‌కు నిర్ణీత రుసుము వ సూలుచేయాల్సి ఉంది. ఇవేవీ ఇక్కడ జరగడం లేదని విమర్శిస్తున్నారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం- వీరేశ, డీఈ, ధర్మవరం

మున్సిపాలిటీలో అక్రమ కొళాయి కనెక్షన్ల గుర్తించాలని సచివాలయ సిబ్బంది, వాటర్‌ మ్యాన్లను సూచించాం. ఫిబ్రవరి ఒకటో తేదీలోగా గుర్తించి వాటిని రెగ్యులర్‌ చేయాలని ఆదేశించాం. ఆ జాబితాను కౌన్సిల్‌లో పెట్టి అక్రమ కొళాయి కనెక్షన్లను తొలగించడమా లేదా డబ్బులు కట్టించుకోవడమా తీర్మానించాలని నిర్ణయించుకున్నాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 26 , 2026 | 11:37 PM