GAMES: ఖాసీంస్వామి ట్రస్టు ఆధ్వర్యంలో ఆటల పోటీలు
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:13 AM
మండలకేంద్రంలో శనివారం ఖాసింస్వామి ట్రస్టు ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఉద యం పురుషులకు ఇరుసు ఎత్తే పోటీలు నిర్వహించారు. మొదటి దశ పోటీలలో ప్రతిభ కనబరిచిన తోపుదుర్తికి చెందిన మధుకు ప్రథమ బహుమతి రూ. 10వేలు, అరవకూరు రామంజికి రెండో బహుమతి రూ. 7వేలు, బానుకోటకు చెందిన రాజుకు మూడో బహుమతి రూ. 3 వేలు అందజేశారు.
బత్తలపల్లి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో శనివారం ఖాసింస్వామి ట్రస్టు ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఉద యం పురుషులకు ఇరుసు ఎత్తే పోటీలు నిర్వహించారు. మొదటి దశ పోటీలలో ప్రతిభ కనబరిచిన తోపుదుర్తికి చెందిన మధుకు ప్రథమ బహుమతి రూ. 10వేలు, అరవకూరు రామంజికి రెండో బహుమతి రూ. 7వేలు, బానుకోటకు చెందిన రాజుకు మూడో బహుమతి రూ. 3 వేలు అందజేశారు. అలాగే రెండో దశ పోటీలలో గంటాపురానికి చెందిన హరికి మొదటి బహుమతి రూ. 10వేలు, ఎర్రోనిపల్లికి చెందిన కరుణకు రెండో బహుమతి రూ. 7వేలు, గొట్లూరుకు చెందిన కిరణ్‌కు మూడో బహుమతి రూ. 3వేలు అందించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు మాజీ ఎంపీపీ జక్కంపూటి సత్యనారా యణ చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు చైర్మన ఖాసింవలి, నాయకులు పురుషోత్తంచౌదరి, తిరుపాలు, మధు, శేషు, నాగేంద్ర, హరి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....