REPUBLIC DAY: ఘనంగా గణతంత్ర వేడుకలు
ABN , Publish Date - Jan 26 , 2026 | 11:44 PM
గణతంత్ర దినోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గ కేంద్రాలతోపాటు మండలకేం ద్రాలు, గ్రామాల్లో జరుపుకున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాల యాలు, విద్యాసంస్థల్లో అధికారులు, నిర్వాహకుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి గణతంత్ర దినం ప్రాముఖ్యతను వివరించారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
గణతంత్ర దినోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గ కేంద్రాలతోపాటు మండలకేం ద్రాలు, గ్రామాల్లో జరుపుకున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాల యాలు, విద్యాసంస్థల్లో అధికారులు, నిర్వాహకుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి గణతంత్ర దినం ప్రాముఖ్యతను వివరించారు. స్వాతంత్య్ర సమరయోధులను, వారి సేవలను స్మరించుకున్నారు. గణతంత్ర దినోత్సవాలను సోమవారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ జాతీయ జెండా ఎగురవేశారు. మహాత్మగాంధీ, బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. డీఆర్వో సూర్యనారాయణ రెడ్డి, ఏఓ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవాలను కన్నులపండువగా ఘనంగా జరుపుకున్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లె సింఘూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘుఽనాఽథరెడ్డి, జూనియర్ ఫస్ట్‌క్లాస్ మేజిసే్ట్రట్ కోర్డులో జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధి కారి ముజీబ్ పసపల సయ్యద్, ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ ఎస్ సతీష్‌కుమార్ తదితర ప్రభుత్వ కార్యాల యాల్లో సంబంధిత అధికారులు జెండా ఎగురవేశారు. కదిరి: పట్టణంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వ హించారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముందుగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్ జాతీయ జెండాను ఎగురవేయగా, ఎమ్మెల్యే జెండా వందనం చేశారు. పలువురు కౌన్సిలర్లు, సిబ్బంది ఉన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో, పుర్కానియా మద రసాలో జెండా వందనానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....