Home » Puttaparthi
సత్యసాయి శత జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. సాయికుల్వంతులో వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీసాయి సత్యనారాయణ సామూహిక వ్రతాలను నిర్వహించారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.
సత్యసాయిబాబా శతజ యంతి ఉత్సవాలలో భాగంగా బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమో దీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతర ప్రముఖులు రానున్న సందర్భంగా మంగళవారం పుట్టపర్తిలోని సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక పనులను మంత్రుల బృం దం పరిశీలించింది.
సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేపట్టింది. ఇందులో బాగంగా పుట్టపర్తి పట్టణం నుంచి తొమ్మిది కిలోమీటర్ల వరకు తొమ్మిది పార్కింగ్ స్థలాలను, ఏడు వైద్య శిబిరాలను, ఏడు సమాచార కేంద్రాలను ఏర్పాటుచేసింది.
సత్యసాయి జయంతి ఉత్సవాలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైభవంగా సాగుతున్నాయి. సాయి భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చి సాయి సమాధిని దర్శించుకుంటున్నారు. ఐశ్వరరాయ్, సచిన్ టెండూల్కర్ ఇవాళ..
పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వెండి రథంపై సత్యసాయి బాబా పుట్టపర్తి పురవీధులలో ఊరేగనున్నారు.
మార్కెట్‌యార్డ్ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పుట్ట పర్తి మార్కెట్‌యార్డ్ చైర్మన, కమిటీ సభ్యులకు సూచించారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో సోమవారం పుట్టపర్తి మా ర్కెట్ కమిటీ సమావేశాన్ని చైర్మన పూలశివప్రసాద్ అధ్యక్షతన నిర్వ హించారు.
రైతులు పండించిన పంటల ను విక్రయించడానికి అనుకూలంగా ఉండడాలని గత ప్రభుత్వం మా ర్కెట్‌యార్డులను ఏర్పాటు చేసింది. మండలం లోని అరవవాండ్లపల్లి వద్ద వ్యవసాయ మార్కెట్ యార్డు భవనాన్ని రూ.3.82 కోట్టు నిధులు వెచ్చించి నిర్మాణం పూర్తి చేశారు. భవనం పూర్తి అయి నాలుగు సంవ త్సరాలు పైబడింది. దాదాపు 14 ఎకరాల్లో భూవిని చదునుచేసి మొదటి విడతగా భవనం నిర్మించారు.
సహకార సంఘాలను మరిం త బలోపేతం చేయాలంటూ జిల్లా ఇనచార్జి ఆదినారాయణ సూచించా రు. స్థానిక ఎనుములపల్లి వ్యవసాయ సహకార సంఘంలో ఆదివారం 72వ అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాలు జరుపుకున్నారు. జిల్లా ఇనచార్జి జెండా ఆవిష్కరించి, సొసైటీ అధ్యక్షుడు ఉమ్మినేని వెంకటరాముడు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
సత్యసాయిబాబా శతజయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 19న పుట్టపర్తికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మ రం చేశారు. ఆదివారం రాత్రి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్ల సమన్వయ అధికారి వీరపాండ్యన పుట్టపర్తికి చేరుకున్నారు.
సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల పురస్కరించుకుని ఈనెల19న ప్రశాంతినిల యానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్టు అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జిల్లా పోలీసుకార్యాలయంలోని పోలీసుకమాండ్ కంట్రోల్ రూం ఆవరణలో బందోబస్తు నిమిత్తం వ చ్చిన 17 జిల్లాల పోలీసు అధికారులకు బందోబస్తు ఏర్పాట్లపై దిశాని ర్దేశం చేశారు.