RMP: ఆర్‌ఎంపీ క్లినిక్‌లలో ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:12 AM
ధర్మవరం పట్టణంలోని పలు ఆర్‌ఎంపీ క్లినిక్‌లలో శనివారం సాయం త్రం అధికారుల బృందం అకస్మిక తనిఖీలు చేపట్టింది. ఆర్డీఓ మహేశ, డీఎస్పీ హేమంతకుమార్, తహసీల్దార్ సురేశబాబు, డాక్టర్ సురేశ, ఎస్‌ఐ ఉమాదేవి, వీఆర్‌ఓ రవిశేఖర్‌రెడ్డి పలు క్లినిక్‌లలో తనిఖీలు చేపట్టి, అక్క డ రోగులకు అందుతున్న చికిత్సల గురించిపరిశీలించారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
ధర్మవరం పట్టణంలోని పలు ఆర్‌ఎంపీ క్లినిక్‌లలో శనివారం సాయం త్రం అధికారుల బృందం అకస్మిక తనిఖీలు చేపట్టింది. ఆర్డీఓ మహేశ, డీఎస్పీ హేమంతకుమార్, తహసీల్దార్ సురేశబాబు, డాక్టర్ సురేశ, ఎస్‌ఐ ఉమాదేవి, వీఆర్‌ఓ రవిశేఖర్‌రెడ్డి పలు క్లినిక్‌లలో తనిఖీలు చేపట్టి, అక్క డ రోగులకు అందుతున్న చికిత్సల గురించిపరిశీలించారు. కొన్న క్లినిక్‌ల లో నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు అదికారులు గుర్తించారు. ప్రధా నంగా స్టెరాయిడ్స్ ఇవ్వడంపట్ల క్లినిక్‌ల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఐదు ప్రైవేటు క్లినిక్‌లకు షోకాజు నోటీసులు అందజేసినట్టు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న మరికొంతమంది క్లినిక్ నిర్వాహకులు ముందుగానే తమ ప్రాథమిక చికిత్స కేంద్రాలను మూసివేసి వెళ్లిపోయినట్టు తెలిసింది. అదేవిధంగా తాడిమర్రిలోని ఆర్‌ఎంపీ ప్రథమ చికిత్స కేంద్రాలను మండల అధికారులు ఆకస్మికంగా తనిఖీచేశారు. రెండింటిలో తనిఖీలు నిర్వ హించగా, మిగిలినవారు తలుపులు మూసేశారు. నంబులపూలకుం టలోని పలు క్ల్లినిక్‌లు నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఓబుళదేవరచెరువు మండలంలోని కొండకమర్ల, ఓబుళదేవరచెరువులలో నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీ క్లినిక్‌లను మండల అధికారులు తనిఖీ చేశారు. పలు క్లినిక్‌లకు షోకాజ్ నోటీసులు ఇచ్చి నట్లు అధికారులు తెలిపారు. అలాగే నల్లచెరువు, నల్లమాడ తదితర మండలకేంద్రాల్లో ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎస్‌ఐలు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....