Home » Puttaparthi
మండలంలోని పలు రోడ్లు గుంతల మయమై ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి యేడాది పూర్తి అయినా నల్లమాడ మండలంలో ఆ రోడ్లలో మార్పులేదు. మండలంలోని శీకివారిపల్లికి రెడ్డిపల్లి - మలక వేమల ప్రధాన రహదారి నుంచి రెండు కిలోమీటర్ల తారు రోడ్డ్డును 15 యేళ్ల క్రితం అప్పటి టిడీపీ ప్రభుత్వంలో వేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ రోడ్డు మరమ్మతులకు నోచుకోలేదు. రోడ్డంతా గుంతలు పడి అ ధ్వానంగా మారింది.
గ్రామాల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేద్దామని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయాలన్న సద్భావంతో పనిచేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురు వారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలికి ఇరువైపులా ఉన్న ఆర్‌అండ్‌బీ స్థలాలలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించు కునేం దుకు రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పంచాయ తీ అధికారులు మార్కింగ్ ఇచ్చారు. ఆ మార్కింగ్ కూడా పుట్టపర్తి రహదారి లో ఒక్కొక్కరికి ఒకరకంగా మార్కింగ్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉండగా బుక్కపట్నం రహదారి కి ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మా ణా ల తొలగింపు కోసం కూడా మార్కింగ్ ఇచ్చారు.
రాష్ట్ల్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలన మొదలై ఏడాదైన సందర్భంగా తమ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్ ఆదేశాల మేరకు ముగ్గుల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. చిలకం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద సంక్రాంతిని తలపించే విధంగా ముగ్గుల పోటీ లు నిర్వహించారు.
రాష్ట్రంలో వైసీపీ వి ధ్వంసకపాలన అంతమై, టీడీపీ, జనసేన బీజేపీ సాధించిన విజ యం ప్రజావిజయమని తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యదర్శి సామ కోటి ఆదినారాయణ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఏడాది పాల న పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నాయకులు బుధవారం పట్ణణంలోని హనుమానకూడలిలో కేక్‌కట్ చేసి సంబరాలు చే సుకున్నారు.
Operation Sindoor: వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓదార్చారు. కుమారుడు మురళీ నాయక్‌ను గుర్తు చేసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పవన్ కళ్యాణ్ గుండెలకు హత్తుకుని బోరున విలపించారు. దీంతో పవన్ కూడా కంటతడి పెట్టారు.
అజ్ఞాతంలో ఉన్న తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌కు హైకోర్టును ఆశ్రయించారు. కేసు వివరాలు సమర్పించాలని పోలీసులు, తదుపరి విచారణ మే 5కు వాయిదా వేసింది
రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ జగన్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా చెప్పారు, "పోలీసుల బట్టలు కష్టపడి సంపాదించుకున్నవి, అవి ఊడదీయడం సులభం కాదు
తోపుదుర్తీ.... జాగ్రత్త.. కులాలు, మతాలు మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందడానికి ప్రయత్నిస్తే బీసీలంతా ఏకమై మిమ్మల్ని రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నామని టీడీపీ నాయకులు ఫైర్ అయ్యారు.
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని యనుములపల్లి సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహా న్ని క లెక్టర్ టీఎస్ చేతన శనివారం తనిఖీ చేశారు. వసతి గృహాన్ని పరిశీలించి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.