EX MINISTER PALLE: కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయండి
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:31 PM
స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. టీడీపీ అమడగూరు, ఓడీ చెరువు మండలాల నాయకులతో శుక్రవారం ఆయన చర్చించారు.
ఓబుళదేవరచెరువు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. టీడీపీ అమడగూరు, ఓడీ చెరువు మండలాల నాయకులతో శుక్రవారం ఆయన చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపునకు క్షేత్రస్థాయిలో మూడు పార్టీల కార్యకర్తలు పనిచేయాలన్నారు. కూటమి అఽధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. అనంతరం రామయ్యపేట గీతామందిరం వద్ద నూతన బోరును ఆయన ప్రారంభించారు. అంతకుముందు బీసీ కాలనీలో నివాసముంటున్న టీడీపీ కార్యకర్త రామాంజనేయులు మృతిచెందాడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇరిగేషన డైరెక్టర్ పత్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, మండల కన్వీనర్ శెట్టివారి జయచంద్ర పాల్గొన్నారు.
మాజీ మంత్రి పల్లెకు సన్మానం: టీడీపీ అధికార ప్రతినిఽఽఽధిగా వల్లెపు సోమశేఖర్‌ను రెండోసారి ఎంపిక చేయడం పట్ల మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని శుక్రవారం నాయకులు ఘనంగా సన్మానించారు. మండల కేంద్రంలో జడ్పీటీసీ పిట్టా ఓబుల్‌రెడ్డి స్వగృహంలో మాజీ మంత్రిని సోమశేఖర్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. గిరిజన సంఘం నాయకుడు రజావత శ్రీనివాస్ నాయక్ పాల్గొన్నారు.