Share News

GARBAGE: గ్రామాల వీధుల్లో పేరుకుపోతున్న చెత్త

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:11 AM

గ్రామ పంచాయతీలు ఆయా గ్రామాలలోని చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసి, దానిని రైతుల కు విక్రయించడంద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీల అభివృద్ధికి వినియోగించాలనే ఉద్దేశ్యంతో 2014లో టీడీపీ ప్రభుత్వం చెత్తతో సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిని ఆయా గ్రామ పంచాయతీ కేంద్రాలలో రూ. లక్షల వెచ్చించి నిర్మించింది.

GARBAGE: గ్రామాల వీధుల్లో పేరుకుపోతున్న చెత్త
Chennekottapalli mandal is a disused shed in Bassinepally

ధర్మవరం, జనవరి 1(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలు ఆయా గ్రామాలలోని చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసి, దానిని రైతుల కు విక్రయించడంద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీల అభివృద్ధికి వినియోగించాలనే ఉద్దేశ్యంతో 2014లో టీడీపీ ప్రభుత్వం చెత్తతో సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిని ఆయా గ్రామ పంచాయతీ కేంద్రాలలో రూ. లక్షల వెచ్చించి నిర్మించింది. గ్రామీణ, మండల ప్రాంతాలలో హరిత రాయబారులతో ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించి, చెత్తతో సంపద తయారీ కేంద్రాలకు తరలించి ఎరువు తయారీకి శ్రీకా రం చుట్టింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చెత్తతో సంపద తయారీ కేంద్రాలను పట్టిం చుకోకపోవడంతో అవి కాస్తా అలంకార ప్రాయంగా మారాయి. జిల్లాలో 432 చెత్తతో సంపద తయారీ కేంద్రాలు ఉండగా, వాటిలో 150 పంచాయతీలలో మాత్రమే వినియోగంలో ఉన్నాయి. మిగిలిన వాటిని వినియోగంలోకి తీసుకురాకపోవడంతో శిథిలావస్థకు చేరాయి. పిచ్చి మొక్కల మధ్యలో దర్శనమిస్తున్నాయి. వాటి నిర్వహణ ను పంచా యతీ అధికారులు, గ్రామ సర్పంచ లు గాలికి వదిలేయడంతో మం దుబాబులకు అడ్డాగా మారాయి.

ఎక్కడి చెత్త అక్కడే

గత టీడీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కేంద్రాలలోని వీధులలో చెత్తను సేకరించి పరిశుభ్రంగా ఉంచడానికి హరిత రాయబా రులను నియమించింది. అలాగే చెత్తతో సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం వారికి జీతాలు ఇవ్వకపోవడం, సం పద తయారీ కేంద్రాల నిర్వహణను గాలికివదిలేసింది.


సిబ్బందికి జీతా లు ఇవ్వకపోవడంతో వారు చెత్త సేకరణ నిలిపివేశారు. దీంతో గ్రామాలలో ఏ వీదులో చూసినా చెత్త దిబ్బలు దర్శనమిసు ్తన్నాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం లో నైనా సంపద తయారీ కేంద్రాలు వినియోగం లోకి తీసుకురావా లంటూ గ్రామ పంచాయతీల్లోని ప్రజలు కోరుతున్నారు. వాటిని విని యోగంలోకి తెచ్చి వీధులలో చెత్త లేకుండా చూ డాలని అంటున్నారు. చెత్త ఎక్కడపడితే ప్రజలు వేయడంతో చెత్తదిబ్బలుగా తయారై, దు ర్వాసనతో పాటు రోగాలు సోకుతున్నాయని పలుగ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిదులు, ఉన్నతాధికా రులు స్పందించి చెత్తతో సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తెచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

త్వరలో వినియోగంలోకి తెస్తాం -సమత, జిల్లా పంచాయతీ అధికారి

జిల్లావ్యాప్తంగా ఎస్‌డబ్ల్యూ ఎంషెడ్లు (చెత్తతో సంపద తయారీ కేంద్రాలు)లు కొన్ని మండలాల్లో వినియోగంలో ఉన్నాయి. కొన్ని మం డలాలలో గ్రామాలకు దూరంగా ఉండటంతో నిర్వహణ కష్టంగా మారింది. వినియోగంలో లేని వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి మౌళిక సదుపాయాలు కల్పించి వినియోగంలోకి తెస్తాం. ప్రభుత్వం కూడా హరిత రాయబారులను నియమించుకునేందుకు మేజర్‌ పంచాయ తీలకు అనుమతి ఇచ్చింది.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 02 , 2026 | 12:11 AM