Home » Puttaparthi
అధికారులందరూ సమన్వ యంతో పనిచేసి ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆర్డీఓ మహేశ పేర్కొన్నారు. ఆయన బుధవారం ధర్మవరం మా ర్కెట్‌యార్డ్‌లో ఉన్న ఎంఎల్‌ఎస్ స్టాక్‌పాయింట్‌ను తనిఖీ చేశారు. గోదాములో ఉన్న నిత్యావసర సరుకులను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్, ఇతర రికార్డులను పరిశీలించి సరుకుల లభ్యత, పంపిణీ వివరాలను క్రాస్ చెక్ చేశారు.
మండల వ్యాప్తంగా నాడు - నేడు పథకం పనులతో పాఠశాలల దశ మారుతుందని ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు ఆశపడ్డారు. అయితే పలు పాఠశాల భవనాలు అర్థాం తరంగా ఆగిపోవడంతో అసౌకర్యాల నడుమ విద్యార్థులు చదువులు కొన సాగిస్తున్నారు. మండలంలోని పాఠశాలల తరగతి గదుల నిర్మాణా లను నూతనంగా చేపట్టి, మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్ది ప్రైవేటు విద్యా సంస్థల కు దీటుగా ఉండేలా చేస్తామని గత వైసీపీ పాలనలో అప్పటి పాలకు ఎంతో ఆర్భాటంగా గొప్పలు పలికారు.
తల్లిపాలే బిడ్డకు శ్రీరామ రక్ష అని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్ పేర్కొన్నారు. స్థానిక ఏరియా ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా సూపరింటెండెంట్ తిప్పేంద్రనాయక్ తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివ రించారు. తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమని, బిడ్డల వ్యాదినిరోధక శక్తిపెర గాలంటే తల్లిపాలే ముఖ్యమన్నారు.
మండల కేంద్రంలోని ట్రాన్సకో కార్యాలయం పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. విద్యుత పరికరాలను, విద్యుత స్తంభాలను వాటికి ఉన్న అల్యూమిని యమ్ వైర్లను అందినకాటికి అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నట్టు ఆ శాఖలోని కొందరు బహి రంగంగానే చర్చించుకుంటున్నారు.
Puttaparthi Theft Incident: ఒకేసారి 10 ఇండ్లలో చోరీ జరగడంతో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అవాక్కైన పరిస్థితి. అయితే దుండగులు చోరీ చేసిన ప్రదేశంలో కలెక్టర్ బంగ్లా కూడా ఉండడం విశేషం.
జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పదో తరగతి విద్యార్థులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు.
CM Chandrababu On Eucation: ఆడ బిడ్డల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చానని.. రిజర్వేషన్‌లలో మహిళకు పెద్ద పీట వేశానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం పథకం డబ్బులు ఇచ్చి చదువు చెప్పించే బాధ్యత తనది అని స్పష్టం చేశారు.
Minister Lokesh Mega PTM: స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చాక చదువుపై పేరెంట్స్ బాధ్యతగా ఉండాలని మంత్రి లోకేష్ సూచించారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని.. విద్యాశాఖ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటుతామని వెల్లడించారు.
CM Chandrababu With Students: విద్యార్థులు చిత్రించిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తిలకించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లోగోతో రూపొందించిన ఫొటో ఫ్రేమ్‌లో వారిద్దరూ ఫొటోలు దిగారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన యేడాదిలోనే ఇచ్చిన పలు హామీలు నెరవేర్చిందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. సుపరిపాలనకు తొలిఅడు గు కార్యక్రమంలో భాగంగా వారు బుధ వారం మండలంలోని కసముద్రం గ్రామంలో పర్యటించారు.