Share News

MLA: రాజముద్రతో భూములపై సంపూర్ణ హక్కు

ABN , Publish Date - Jan 03 , 2026 | 11:45 PM

భూములపై సంపూర్ణ హక్కుదారులుగా రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలతో కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. మండలంలోని కదిరికుంట్లపల్లిలో శనివారం రెవెన్యూ శాఖ ఆఽధ్వర్యంలో చేపట్టిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

MLA: రాజముద్రతో భూములపై సంపూర్ణ హక్కు
M.L. Kandikunta is distributing Pattadaru pass books

ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌

కదిరి అర్బన, జనవరి 3(ఆంధ్రజ్యోతి): భూములపై సంపూర్ణ హక్కుదారులుగా రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలతో కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. మండలంలోని కదిరికుంట్లపల్లిలో శనివారం రెవెన్యూ శాఖ ఆఽధ్వర్యంలో చేపట్టిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహనరెడ్డి ఫొటోతో ఉన్న పాసు పుస్తకాలను రైతులకు అందిస్తే,


కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసి రాజముద్రను ముద్రించిన పాసు పుస్తకాలను పంపిణీ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ మురళీకృష్ణ, డీడీఓ వెంకటరత్నం, ఎంపీడీఓ పోలప్ప, పంచాయతీ కార్యదర్శి రామ్మోహన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాడిమర్రి: మండలంలోని తిరుమలాపురం గ్రామంలో శనివారం తహసీల్దార్‌ భాస్కర్‌రెడ్డి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేపట్టారు. గ్రామంలో 116 మంది రైతులకు 574 ఎకరాలకు సంబంధించి పాసు పుస్తకాలను అందజేశారు. టీడీపీ మండల కన్వీనర్‌ కూచి రాము, పాపా నాయుడు, హర్ష, రంగయ్య, సుధాకర్‌, పక్కీర్‌రెడ్డి పాల్గొన్నారు.

బత్తలపల్లి: మండపరిధిలోని అప్రాచెరువు గ్రామంలో శనివారం రైతులకు తహసీల్దార్‌ స్వర్ణలత నూతన పట్టాదారు పాసుపుస్తకాలు పం పిణీ చేశారు. మండలంలోని రీ సర్వే జరిగిన అప్రాచెరువు, చెన్నరాయ పట్నం, రాఘవంపల్లి గ్రామా గ్రామాల రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేసినట్లు తహసీల్దార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వీరనారప్ప, భాస్కర్‌, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 03 , 2026 | 11:45 PM